రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వాడకం పెరగడం మంచి పరిణామమని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సోలార్ విద్యుత్ తయారీకి ఖర్చు చాలా తక్కువ అవుతోందన్నారు.
ప్రభుత్వం కార్యాలయాల్లో కూడా ఎల్ఈడీ లైట్లు వాడుతున్నారని తెలిపారు. సాంకేతిక విద్యాసంస్థల్లో విద్యార్థులకు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కరెంట్‌ను పొదుపు చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను నివాసాల్లో వాడాలని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు సూచించారు.
ఇదీ చదవండి : అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష