దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు ఎంబామింగ్ ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలను వైద్యులు ఎంబామింగ్ నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వెల్లడయ్యే వరకు మృతదేహాలను గాంధీ మార్చురీలోనే భద్రపరచనున్నందున... కుళ్లిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో వైపు మృతదేహాలను ఎప్పుడు తమకు అప్పగిస్తారా అని కుటుంబసభ్యులు వేచి చూస్తున్నారు.
ఇదీ చూడండి: "బాధతో విలవిలలాడుతున్నా.. కనికరించ లేదు"