ETV Bharat / city

తహసీల్దార్​ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి - driver chendrayya died

విజయారెడ్డి హత్య కేసులో డ్రైవర్ గురునాథం మృతి
author img

By

Published : Nov 5, 2019, 10:59 AM IST

Updated : Nov 5, 2019, 12:55 PM IST

10:55 November 05

తహసీల్దార్​ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి

తహసీల్దార్​ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి

తహసీల్దార్​ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం ఇవాళ డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంతోష్ నగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురునాథం మంటల్లో కాలిపోతున్న విజయా రెడ్డిని కాపాడే ప్రయత్నంలో అగ్నికి ఆహుతయ్యాడు. కాపాడుతున్న తరుణంలో దాదాపు 80 శాతం పైగా కాలిపోయిన గురునాథంను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్​కు ఓ కుమారుడు, భార్య(7 నెలల గర్భవతి) ఉన్నారు. అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో గురునాథం మృతితో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహన్ని  పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

10:55 November 05

తహసీల్దార్​ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి

తహసీల్దార్​ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి

తహసీల్దార్​ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం ఇవాళ డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంతోష్ నగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురునాథం మంటల్లో కాలిపోతున్న విజయా రెడ్డిని కాపాడే ప్రయత్నంలో అగ్నికి ఆహుతయ్యాడు. కాపాడుతున్న తరుణంలో దాదాపు 80 శాతం పైగా కాలిపోయిన గురునాథంను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్​కు ఓ కుమారుడు, భార్య(7 నెలల గర్భవతి) ఉన్నారు. అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో గురునాథం మృతితో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహన్ని  పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Intro:వనపర్తి జిల్లా,కొత్తకోట మండలం ,కనిమెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని పాత జంగమాయ పల్లి - కనిమెట్ట గ్రామాలకు వాగు నుండి నీరు రావడం తో పై వంతెన లేక రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామానికి వెళ్లాలంటే 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే.


Body:ఆ గ్రామానికి వెళ్లాలంటే_50 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే.......
వనపర్తి జిల్లా,కొత్తకోట మండలం ,కనిమెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని పాత జంగమాయ పల్లి - కనిమెట్ట గ్రామాలకు వాగు నుండి నీరు రావడం తో పై వంతెన లేక రాకపోకలు నిలిచిపోయాయి.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ ద్వారా సరళ సాగర్ ప్రాజెక్ట్ కు గత 45 రోజులుగా నీటిని నింపడం జరుగుతుంది. ప్రస్తుతం సరళా సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటి మట్టాన్ని కలిగి ఉంది.
దీని యొక్క బ్యాక్ వాటర్ వలన పాత జంగమయ్య పల్లి కనిమెట్ట గ్రామాల మధ్యలో గల వాగులో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు మధ్యలో మూడున్నర ఫీట్ల లోతు కు పైగా నీటి ప్రవాహం కలదు.
దీనివల్ల కనిమెట్ట పాత జంగమయ్య పల్లి మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిత్యవసర వస్తువులు తరలించడం కూడా చాలా ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు తెలిపారు. రేషన్ బియ్యానికి సైతం కనిమెట్ట గ్రామానికి రావాల్సి ఉందని, కుటుంబంలో ఉండే అబ్బాయిలు బియ్యం బస్థాని భుజం పై వేసుకొని, నడుము లోతు నీళ్లలో ఇబ్బంది పడుతూ తీసుకురావడం జరుగుతుంది అని తెలిపారు.
పాత జంగమయ్య పల్లి గ్రామం కనిమెట్ట గ్రామపంచాయతీ లో అంతర్భాగంగా ఉంటుంది. గ్రామపంచాయతీకి రావాలంటే వాగు ప్రవహించకపోతే రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే కలదు. ఇప్పుడు గ్రామ పంచాయతీకి రావాలంటే దాదాపుగా 30 నుండి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిందే.
గత కొన్ని సంవత్సరాలుగా కనిమెట్ట, పాత జంగమయ్య పల్లి గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
2017 జులై లో గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాగుపై వంతెన నిర్మించడానికి 2.60 కోట్ల రూపాయలు వెచ్చించి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. కానీ పనులు ప్రారంభించి , నిధులు సరిపోవని గుత్తేదారు పనిని నిలిపి వేసాడు.
దేవరకద్ర శాశన సభ సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ బ్రిడ్జ్ గురించి సంబంధిత మంత్రిని కోరడం జరిగింది. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 6.50 కోట్ల రూపాయలతో నివేదిక సమర్పించారు.ఇది ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. ఇప్పటివరకు వాగుపై వంతెన నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు.
500 జనాభా కలిగిన పాత జంగమయ్య పల్లి గ్రామ ప్రజలు ఈ దారిగుండా ప్రయాణిస్తే రెండున్నర కిలోమీటర్ల పరిధిలోనే జాతీయ రహదారిని చేరుకుంటారు. అక్కడి నుండి మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.
ప్రస్తుతం గత 15 రోజుల నుంచి వాగు ప్రయాణించడం వల్ల మండల కేంద్రానికి రావడానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రతిసారి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు , వృద్ధులు, మహిళలు ఈ దారిగుండా ప్రయాణించుటకు అవకాశమే లేదు.
పాత జంగమయ్య పల్లి గ్రామం నుండి బయట గ్రామానికి వెళ్లే కుటుంబీకులను ట్రాక్టర్ల ద్వారా వాగు దాటించడం జరుగుతుంది. ఇది చాలా ఇబ్బంది కరంగా ఉందని, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి , తక్షణమే బ్రిడ్జి నిర్మాణానికి పూను కోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆసుపత్రులకు మరియు రోజు ఉపయోగించే నిత్యవసర వస్తువులు ,మందుల కోసం వృద్ధులు ఈ దారి గుండా ప్రయాణించి మధ్యలో ఇబ్బంది పడడం జరుగుతుంది.
కనీసం గ్రామం నుండి మరొక దారి గుండా వెళ్లడానికి ఎలాంటి రవాణా సదుపాయాలు కూడా లేవు అని గ్రామస్తులు వాపోయారు. తమకు సొంతంగా ప్రైవేటు వాహనాలు ఉన్నవారు మాత్రమే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్లడానికి అవకాశం ఉందని , మిగతావారు ఏదోవిధంగా ఇబ్బంది పడుతూ వాగు దాటుతూ ప్రయాణించాల్సిందే అని తెలిపారు.
సరళ సాగర్ బ్యాక్ వాటర్ ఆగడం వలన కనిమెట్ట గ్రామానికి సంబంధించిన 40 నుండి 50 ఎకరాల వరి పంట పూర్తిగా నీట మునిగిందని రైతు తిప్పారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
పంట వేసినప్పుడు నీళ్లు లేక ఇబ్బంది పడ్డామని, ఏదోవిధంగా కష్టపడి దాదాపు ఎకరాకు 30 వేల దాకా పెట్టుబడి పెట్టి , పంట చేతికి వస్తుందనుకునే సమయంలో నీరు రావడంతో పంట పూర్తిగా మునిగిపోయిందని,దీతో ఏమి చేయాలో తోచక తాము తీవ్ర ఆందోళనలో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుకున్నారు.
గర్భవతిగా ఉన్న ఆడవాళ్ళు ఐదు నిమిషాలలో మండల కేంద్రంలో గల ఆస్పత్రులకు చేరుకో వచ్చు, కానీ వాగు ప్రవహించడం వలన ప్రస్తుతం గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదని , ప్రైవేటు వాహనం ద్వారా వెళితే చుట్టూ తిరిగి మండల కేంద్రానికి రావటానికి కనీసం రెండు గంటల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.అంత సమయం లో పేషెంట్ పరిస్థితి విషమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా పాత జంగమయ్య పల్లి పై దయ చూపి బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.



Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.
Last Updated : Nov 5, 2019, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.