రామోజీ ఫిల్మ్‌సిటీలో ఏఎస్‌ఐఎస్‌సీ ఏపీ, తెలంగాణ రీజియన్, రమాదేవి పబ్లిక్‌స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఎస్‌ఐఎస్‌సీ 23వ జాతీయస్థాయి సాహితీ అంశాల పోటీల ముగింపు కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడారు. ఈటీవీ భారత్ రూపొందించి వైష్ణవ జనతో గీతం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. గీతాన్ని సమర్పించిన రామోజీరావుకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ ప్రశంసలు అందుకున్న వైష్ణవ జనతో గీతం దేశ భక్తిని, జాతీయ వాదాన్ని చాటిందని కొనియాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు బాగున్నాయన్నారు. విద్యార్థుల ప్రదర్శనలు మన దేశ వైవిధ్యాన్ని చాటి చెప్పాయన్నారు. స్వామి వివేకానంద ఎక్కడికి వెళ్లినా నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని అనేవారని గుర్తు చేశారు. ఏకాగ్రతతో ఏదైనా సాధించవచ్చని ఆయన చాటిచెప్పారని తమిళిసై అన్నారు. విద్యార్థి జీవితాన్ని చక్కగా ఆనందించాలని, ఎక్కడా రాజీపడొద్దని విద్యార్థులకు సూచించారు. తాను ఇవాళ ఈ స్థితిలో ఉండేందుకు ఉపాధ్యాయులే కారణమని తమిళిసై పేర్కొన్నారు.
ఇవీ చూడండి : ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతానికి మోదీ అభినందన