ETV Bharat / city

"దాడికి దిగారు... తప్పని పరిస్థితుల్లో కాల్చి చంపారు"

author img

By

Published : Dec 6, 2019, 5:32 PM IST

దిశ హత్యోదంతంలో తొలుత ఎలాంటి ఆధారాలు లేకుండా విచారణ ప్రారంభించి క్రమంగా సైంటిఫిక్‌ ఆధారాలను సేకరించామని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఘటనాస్థలంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

cyberbad cp sajjanar press meet on 'disha' victims encounter

"దాడికి దిగారు... తప్పని పరిస్థితుల్లో కాల్చివేశారు"

ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు, అందుకు గల కారణాలను సీపీ మీడియాకు వివరించారు. ‘‘గత నెల 28న ఉదయం దిశను చటాన్‌పల్లి వద్ద కాల్చివేశారు. ఆ తర్వాత నిందితులను పట్టుకుని 30న మెజిస్ట్రేట్‌ వద్ద హాజరుపరిచాం. 10 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి ఇచ్చారు. ఈనెల 4న నిందితులను చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నాం.

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం రాలేదు...

నిందితులను అనేక విషయాలు ప్రశ్నించాం. రెండు రోజుల కస్టడీలో నిందితులు చాలా విషయాలు చెప్పారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం అక్కడకు తీసుకెళ్లలేదు. దిశకు సంబంధించిన వస్తువులు చూపెడతామంటే నిందితులను చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చాం. దిశ ఫోన్‌, వాచీ, పవర్‌బ్యాంక్‌ దాచిన చోటుకు వారిని తీసుకెళ్లాం.

రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి...

రాళ్లు, కర్రలతో పోలీసులపై నిందితులు దాడికి పాల్పడ్డారు. మహ్మద్‌ ఆరిఫ్‌, చెన్నకేశవులు పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులకు యత్నించారు. పోలీసులు పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో నిందితులపై కాల్పులు జరిపారు.

కాల్పులు ఏ సమయంలో జరిగాయంటే...

ఈ ఉదయం 5.45 నుంచి 6.15 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. నిందితులు జరిపిన రాళ్లదాడిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌కు గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ప్రథమ చికిత్స అందించి కేర్‌ ఆస్పత్రికి తరలించాం. పోలీసులకు బుల్లెట్‌ గాయాలు కాలేదు.

మహబూబ్​నగర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం...

నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తాం. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం.

గతంలో ఈ నిందితులు తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటకల్లోనూ ఈ తరహా ఘటనలకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. దానిపై లోతుగా విచారణ జరుపుతున్నాం. బాధితురాలితో పాటు నిందితుల కుటుంబ సభ్యుల వివరాలు కూడా గోప్యంగా ఉంచాలని కోరుతున్నాం.’’ అని సజ్జనార్‌ వివరించారు.

సంబంధిత కథనాలు...

లైవ్​ వీడియో: నిందితుల చేతిలో రివాల్వర్​

ఎన్​కౌంటర్​పై పోలీసులకు ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు

దిశ అత్యాచారం, హత్య నుంచి నేటి ఎన్​కౌంటర్​ వరకు..

Sirohi (Rajasthan), Dec 06 (ANI): President Ram Nath Kovind at an event in Rajasthan's Sirohi said that women safety is a serious issue and in no way rape convicts under Protection of Children from Sexual Offences (POCSO) Act should not have right to file mercy petition. "Women safety is a serious issue. Rape convicts under POCSO Act should not have right to file mercy petition. Parliament should review mercy petitions," said President Kovind.

For All Latest Updates

TAGGED:

shadnagar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.