ప్రజలను మోసం చేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాతాల నుంచి అక్రమంగా నగదు చోరీ చేస్తున్న జార్ఖండ్‌కు చెందిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులు ఈ-వ్యాలెట్, యూపీఐ కోడ్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు.
ఓ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ...ఆఫర్ల పేరుతో యూపీఐ కోడ్, ఓటీపీ వంటి కీలక సమాచారం సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ సజ్జనర్ తెలిపారు. ముఠా సభ్యులు స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫుడ్ పాండా సైట్లలో నకిలీ ఫోన్ నంబర్లు పెట్టి మోసం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.