ETV Bharat / city

హైదరాబాద్​లో ఎస్​బీఐ క్రెడిట్​ కార్డుల పేరిట మోసం.. - sbi credit cards scam

హైదరాబాద్​లో ఎస్​బీఐ క్రెడిట్​ కార్డుల పేరిట వినియోగదారులను మోసం చేస్తున్న వ్యక్తిని సైబర్​క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన నెమళ్ల శ్రీధర్​గా గుర్తించారు. కోర్డు ఆదేశాలతో జైలుకు తరలించారు.

హైదరాబాద్​లో ఎస్​బీఐ క్రెడిట్​ కార్డుల పేరిట మోసం..
author img

By

Published : Oct 29, 2019, 4:33 PM IST

ఎస్​బీఐ క్రెడిట్​ కార్డుల పేరిట మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్​ సైబర్​ క్రైం​ పోలీసులు అరెస్ట్​ చేశారు. దరఖాస్తు చేసిన వారికి క్రెడిట్​ కార్డులు ఇవ్వకుండా.. వారి పేర్లు మీద కార్డులు పొంది.. రూ.15 లక్షలు స్వాహా చేసిన కేసులో నెమళ్ల శ్రీధర్​ అనే వ్యక్తిపై కేసు నమోదుచేశారు.

ఎస్​బీఐ క్రెడిట్​ కార్డులు పేరిట పొరుగు సేవల సిబ్బంది హైదరాబాద్​లోని పలు దుకాణ సముదాయాలు, ఇతర ప్రాంతాల్లో తిరిగి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు విభాగం అధికారులకు పంపిస్తారు. పరిశీలన అనంతరం దరఖాస్తు దారుల్లో అర్హులకు ఎస్​బీఐ అధికారులు కార్డులను పంపిస్తారు. అలా పంపించిన కార్డులను శ్రీధర్​ బృందం తీసుకొని రుణ పరిమితి వరకు వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. కార్డులు వినియోగిస్తుండడం.. నెలవారీ నగదు జమచేయకపోవడంపై అనుమానమొచ్చిన అధికారులు సైబర్​ క్రైంను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ పత్రాల ఆధారంగా కార్డులు తీసుకున్నట్లు తేల్చారు. అనంతరపురం జిల్లాకు చెందిన నెమళ్ల శ్రీధర్​ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాలుగు నెలల క్రితమే హైదరాబాద్​ వచ్చినట్లు గుర్తించారు. అనంతరం కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు.

హైదరాబాద్​లో ఎస్​బీఐ క్రెడిట్​ కార్డుల పేరిట మోసం..

ఇవీచూడండి: బ్లాక్​లో రైల్వే​ టికెట్లు.. వెయ్యికిపైగా స్వాధీనం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.