ETV Bharat / city

'పూటుగా తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు' - shamshabad murder

'ఏమో సర్‌... అప్పుడు మేము ఫుల్లుగా తాగి ఉన్నాం. ఏం చేస్తున్నామో సోయి లేదు. పొద్దున్నుంచి ఖాళీగా లారీలో కూర్చోని విసుగు పుట్టింది. ఒంటరిగా యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం.' అని 'దిశ' హత్యోదంతంలో నలుగురు నిందితులు విచారణలో వెల్లడించారు.

"మేము పుల్లుగా తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు"
"మేము పుల్లుగా తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు"
author img

By

Published : Dec 2, 2019, 4:26 AM IST

Updated : Dec 2, 2019, 1:52 PM IST

సంచలనం రేపిన 'దిశ' హత్యాచారం కేసులో నిందితులు విచారణలో వెల్లడించిన విషయాలను చూసి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. దిశ తన వాహనాన్ని నిలిపి అక్కడ నుంచి వెళ్లిపోగానే అప్పుడే ఆమెను చెరబట్టాలని పథకం వేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. రాత్రి 9 గంటల తర్వాతే రావడం వల్ల హడావుడిగా లారీలో నుంచి కిందకు దిగారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని మద్యం సేవిస్తూ నిర్ణయించుకున్నారు. ఆమెను చంపేసి కాల్చేస్తే ఇంత దూరం వస్తుందనుకోలేదని నిందితులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. నలుగురు నిందితుల్లో ముగ్గురి వయసు 20 ఏళ్లే... నలుగురికీ ఇంతకు ముందు నేర చరిత్ర లేదు.

అప్పటి వరకు ఏం చేశారు?

గతంలో తాను దొంగిలించిన ఇనుప కడ్డీలను అమ్మేందుకు రావాలంటూ నవీన్‌, చెన్నకేశవులను ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ పిలిచాడు. 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విక్రయించారు. అదే రోజు రాత్రి శంషాబాద్‌ శివారుల్లోని తొండుపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి 27వ తేదీ ఉదయం 9 గంటలకు తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌కొచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు మద్యం సేవించడం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నలుగురు కలిసి ఏం చేశారన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. లోడ్‌ దించేందుకు నలుగురు ఉండాల్సిన అవసరం లేదు కదా అనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది.

ఇవీ చూడండి: ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను: కేసీఆర్‌

TG_HYD_11_02_CULPRITS_INTEROGATION_PKG_TS10009_3066407 REPORTER:K.SRINIVAS CON:B.RAMAKRISHNA NOTE:ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( ) ఏమో సార్‌...అప్పుడు మేము పుల్లుగా తాగి ఉన్నాం. ఏం చేస్తున్నామో సోయి లేదు. పొద్దున్న నుంచి ఖాళీగా లారీలో కూర్చోని విసుగు పుట్టింది. ఒంటరిగా యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం. అని శంషాబాద్‌ శివారులో యువ వైద్యురాలు జస్టిస్‌ ఫర్‌ దిశ హత్యోదంతంలో నలుగురు నిందుతులు విచారణలో వెల్లడించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.....LOOOK V.O:సంచలనం రేపిన జస్టిస్‌ ఫార్‌ దిశ హత్యాచారం కేసులో నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించిన విషయాలను చూసి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. దిశ తన వాహనాన్ని నిలిపి అక్కడ నుంచి వెళ్లిపోగానే అప్పుడే ఆమెను చెరబట్టాలని పథకం వేసినట్టు నిందితులు పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయి ఎంత ఆలస్యంగా వస్తే మా పని అంత సులువవుతుందని నిందితులు భావించినట్లుగా తెలుస్తోంది. రాత్రి 9 గంటల తర్వాతే రావడంతో హడావుడిగా లారీలో నుంచి కిందకు దిగారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని మద్యం సేవిస్తూ నిర్ణయించుకున్నారు. ఆమెను చంపేసి కాల్చేస్తే ఇంత దూరం వస్తదనుకోలేదని చెప్పడంతో పోలీసులు ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. నలుగురు నిందితుల్లో ముగ్గురి వయస్సు 20 ఏళ్లే నలుగురికి కూడా ఇంతకు ముందు నేర చరిత్ర లేదు. జస్టిస్‌ ఫర్‌ దిశపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, చంపి అక్కడి నుంచి మృతదేహాన్ని 28 కి.మీలకు పైగా తీసుకొచ్చి పెట్రోల్‌, డీజిల్‌తో కాల్చేందుకు అంత ధైర్యం ఎలా వచ్చిందంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. V.O:విచారణలో పోలీసులు అడిగినప్పుడు కూడా నిందితుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. దొంగిలించిన ఇనుప కడ్డీలను అమ్మేందుకు రావాలంటూ నవీన్‌, చెన్నకేశవులను ప్రధాన నిందితుడు పిలిచాడు. 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విక్రయించారు. అదే రోజు రాత్రి శంషాబాద్‌ వివారుల్లోని తొండుపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి 27వ తేదీ ఉదయం 9 గంటలకు తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌కొచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు మద్యం సేవించడం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నలుగురు కలిసి ఏం చేశారన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. లోడ్‌ దించేందుకు నలుగురు ఉండాల్సిన అవసరం లేదు కదా అనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. V.O: శంషాబాద్‌ శివారులోని తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ దగ్గర హత్యాచారానికి గురైన యువ పశువైద్యురాలి పేరును మార్చాలని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. యువతి పేరును జస్టిస్‌ ఫర్‌ దిశ అని మార్చారు. ఆ మేరకు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఒప్పించారు. సామాజిక, ప్రసార మాధ్యమాల్లో ఇక నుంచి మృతురాలి అసలు పేరు వాడొద్దని సజ్జనార్‌ సూచించారు. ఆమె కుటుంబ సభ్యుల వివరాలపై గోప్యత పాటించాలని విజ్ఞప్తి చేశారు. OVER....
Last Updated : Dec 2, 2019, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.