హైదరాబాద్ వరద బాధిత కాలనీల్లో సహాయక చర్యలు చేపట్టడంలో సర్కారు విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్‌లతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్మక్త, పెద్దగణేశ్, సీబీఐ క్వార్టర్స్‌లో వరదను పరిశీలించారు. ఆ ప్రాంతం గవర్నర్, ముఖ్యమంత్రి ఇళ్లకు సమీపంలో ఉన్నా.... ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు.
వర్షం పడితే వరద నీరు వెళ్లే పరిస్థితి లేదని.... సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో ఏం పనులు చేశారని దుయ్యబట్టారు. వంద రోజుల్లో నగరాన్ని అద్భుతంగా చేస్తానన్న మంత్రి.. ఏళ్లు గడిచిపోయినా ఏమీ చేయలేదన్నారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించినా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వరదలకు చనిపోయిన వారి సంఖ్యనూ తక్కువ చేసి చూపుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
ఇవీచూడండి: మంజీరా నదిలో చిక్కుకున్న ఐదుగురు.. రక్షించాలంటూ వినతి