ETV Bharat / city

పెయింట్​ డబ్బాలు పడేస్తున్నారా... తస్మాత్​ జాగ్రత్త!

పెయింట్ డబ్బాలు పేలుతున్నాయి. ఇంటి గోడలకు, కిటికీలకు, తలుపులకు రంగులద్దిన తర్వాత... వాటిలో మిగిలిపోయే రంగులను అలాగే వదిలేసి పడేస్తున్న డబ్బాలే చిన్నపాటి బాంబుల్లా మారుతున్నాయి. ఒక్కసారిగా తెరుస్తుండటం వల్ల రసాయనిక చర్యల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చెత్తకుండీలో పడేస్తోన్న పెయింట్​ డబ్బాలు చెత్త ఏరుకునే వారి పాలిట యమపాశాలవుతున్నాయి. భాగ్యనగరంలో ఈ తరహా పేలుళ్లు ఎక్కువవుతున్నాయి.

పేలుతున్న పెయింట్​ డబ్బాలు
author img

By

Published : Nov 9, 2019, 4:50 AM IST

Updated : Nov 9, 2019, 10:10 AM IST

పెయింట్​ డబ్బాలు పడేస్తున్నారా... తస్మాత్​ జాగ్రత్త!

హైదరాబాద్​ మీర్​పేట్​లోని విజయపురి కాలనీలో చెత్తలో ఉన్న రంగు డబ్బా మూత తెరుస్తుండగా... పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నిర్మల అనే చెత్త సేకరించే మహిళ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. నెల క్రితం రాజేంద్రనగర్​లోని అత్తాపూర్​లోనూ డబ్బా పేలి సయ్యద్ ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు.

నేలకేసి కొట్టాడు.. అంతే!

చెత్తకుండీలో పెయింట్ డబ్బాను గుర్తించిన ఖాజా.... దాని తీసుకొని రహదారి పక్కనే కూర్చొని తెరిచేందుకు ప్రయత్నించాడు. రాయికేసి బలంగా కొట్టగా.. ఒక్కసారిగా పేలి శరీరానికి మంటలంటుకున్నాయి. ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు

గతేడాది జనవరిలో యూసూఫ్ గూడ వెంకటగిరి కూడలిలో ఉన్న స్క్రాప్ దుకాణంలో మాణిక్ రావు అనే వ్యక్తి పాత వస్తువులను విక్రయించాడు. తన వద్ద ఉన్న డబ్బా మూత తీసే క్రమంలో నేలకేసి బలంగా కొట్టగా పేలుడు సంభవించి మాణిక్ రావు మృతి చెందాడు.

రసాయనానికి ఆక్సిజన్​ తోడై...

గృహాలకు రంగులు వేసేందుకు రకరకాల కంపెనీలకు చెందిన పెయింట్ డబ్బాలను వినియోగిస్తున్నారు. మిగిలిన రంగును అలాగే వదిలేసి మూత పెడుతున్నప్పుడు గాలి డబ్బాలోకి చేరుతోంది. ఆ గాలి డబ్బా కింది భాగంలోకి చేరుకుని... పెయింట్​లో ఉండే రసాయనాలకు ఆక్సిజన్​ తోడై మిథైన్​గా మారుతోంది. చెత్తకుండీల్లో డబ్బాలు పడేసినప్పుడు ఎండకు వేడెక్కుతున్నాయి. ఆ వేడి వల్ల లోపలున్న రసాయన ద్రావణానికి ఆక్సిజన్​ తోడై విస్ఫోటనం జరుగుతోంది.

ఇలా చేస్తే.. పేలవు

స్టోర్ రూమ్​లలో పాత పెయింట్ డబ్బాలుంటే అవి పేలిపోతాయేమోనన్న కంగారులో వాటిని పడేసినా అవి కూడా పేలే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. నిరుపయోగంగా ఉన్న పెయింట్​ డబ్బాలను తెరిచే ముందు రెండు గంటల పాటు చల్లని నీళ్లలో ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా డబ్బా మూత తెరిచి చెత్తకుండీలో పడవేస్తే ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

TG_HYD_02_09_COLOUR_DABBALU_BLASTS_PKG_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ NOTE- జవవరి నెలలో వచ్చిన HYD_TG_02_30_JUBLEEHILLS_BLAST, సెప్టెంబర్ నెలలో వచ్చిన TG_HYD_66_88_RJNR_BLAST తో పాటు ఈ రోజు వచ్చిన TG_HYD_24_08_BLAST విజువల్స్ వాడుకోగలరు. ( ) పెయింట్ డబ్బాలు పేలుతున్నాయి. ఇంటి గోడలకు, కిటికీలకు, తలుపులకు రంగులద్దిన తర్వాత.... వాటిలో మిగిలిపోయే రంగులను అలాగే వదిలేసి పడేస్తున్న డబ్బాలే చిన్నపాటి బాంబుల్లా మారుతున్నాయి. చెత్తకుండీలు, చెత్తా చెదారం వద్ద ఉండే డబ్బాలను చెత్త సేకరించే వాళ్లు ఒక్కసారిగా తెరుస్తుండటంతో రసాయనిక చర్యల కారణంగా విస్పోటనం జరిగి ప్రమాదాలవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఈ తరహా పేలుళ్లు ఎక్కువవుతున్నాయి.....LOOK V.O- మీర్ పేట్ లోని విజయపురి కాలనీలలో చెత్తాచెదారంలో ఉన్న రంగుల డబ్బా మూత తెరుస్తుండగా... పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నిర్మల అనే చెత్త సేకరించే మహిళ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. నెల క్రితం రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ లోనూ డబ్బా పేలి సయ్యద్ ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు. చెత్తకుండీలో పెయింట్ డబ్బాను గుర్తించిన ఖాజా.... దాని తీసుకొని రహదారి పక్కనే కూర్చొని డబ్బాను ముద్దముద్దగా చేసేందుకు ప్రయత్నించాడు. డబ్బాను రాయికేసి బలంగా కొట్టడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఖాజా శరీరానికి మంటలంటున్నాయి. తీవ్రంగా గాయపడిన ఖాజాను ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. గతేడాది జనవరిలో యూసూఫ్ గూడలోని వెంకటగిరి కూడలిలో ఉన్న స్క్రాప్ దుకాణానికి మాణిక్ రావు అనే వ్యక్తి వాడిపడేసిన వస్తువులను తీసుకొచ్చి విక్రయించాడు. తన వద్ద ఉన్న డబ్బాను మూత తీసి విక్రయించే ప్రయత్నంలో భాగంగా... నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో పేలుడులో మంటల దాటికి మాణిక్ రావు మృతి చెందాడు. V.O - గృహాలకు రంగులు వేసేందుకు రకరకాల కంపెనీలకు చెందిన పెయింట్ డబ్బాలను వినియోగిస్తున్నారు. చివరికి అందులో కొంత రంగును అలాగే వదిలేస్తున్నారు. పెయింట్ డబ్బాలో రసాయమ మిశ్రమాలు, ద్రావకాలుంటున్నాయి. మూతపెట్టే ముందు గాలిమొత్తం ఆ డబ్బాలోకి వెల్తుంది. మూతపెట్టగానే గాలి నెమ్మదిగా కింది భాగానికి చేరుకుంటుంది. పెయింట్, రసాయనాలకు ఆక్సిజన్ తోడవడంతో మిథైన్ రసాయనంగా మారుతుంది. చెత్తకుండీలపై డబ్బాలను పడవేస్తుండటంతో ఎండ వల్ల డబ్బా వేడెక్కుతుంది. ఈ వేడి వల్ల లోపలున్న పెయింట్, గాలిపై ప్రభావం పడుతుంది. రసాయన ద్రావణానికి తోడు... డబ్బాలో ఉండే ఉండే ఆక్సిజన్ కలిసి మండే గుణం వల్ల విస్ఫోటనం జరుగుతుంది. స్టోర్ రూమ్ లు, పాత సామాన్లలో పాత పెయింట్ డబ్బాలుంటే అవి పేలిపోతాయేమోనన్న కంగారులో పడేసినా.... అవి కూడా పేలే ప్రమాదముందని నిపుణలు చెబుతున్నారు. E.V.O- ఒక వేళ్ల ఇళ్లల్లో పెయింట్ డబ్బాలను నిరుపయోగంగా ఉంచినట్లైతే తగిన సూచనలు తీసుకోవాలి. చల్లని నీళ్లను తీసుకుని... అందులో రెండు గంటల పాటు పెయింట్ డబ్బాలను ఉంచి... ఆ తర్వాత నెమ్మదిగా డబ్బా మూత తెరిచి చెత్తకుండీలో పారేసినా ఎలాంటి ప్రమాదం వాటిళ్లదు.
Last Updated : Nov 9, 2019, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.