ETV Bharat / city

ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను: కేసీఆర్‌

ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం పట్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామన్న కేసీఆర్‌.. కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతించమని హామీ ఇచ్చారు.

ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను: కేసీఆర్‌
ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను: కేసీఆర్‌
author img

By

Published : Dec 2, 2019, 4:17 AM IST

Updated : Dec 2, 2019, 7:14 AM IST

ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను: కేసీఆర్‌

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ప్రకటించారు. ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. సమష్టిగా కష్టపడి పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తితోనే ఆర్టీసీని లాభాల బాటన నడిపించాలని కోరారు. సంస్థను బతికించడానికి ప్రభుత్వం తరుఫున చేయాల్సిందంతా చేస్తామని... ఇక అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

వరాల జల్లులు ఇవే...

ప్రగతిభవన్ వేదికగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ సంక్షేమ సభ్యులతో గంటన్నరసేపు మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారం చెల్లిస్తామన్నారు. వీటితో పాటు పలు వరాలు ప్రకటించారు.

  1. సమ్మె కాలంలో వేతనం ఒకేసారి చెల్లింపు.
  2. ఆర్టీసీకి బడ్జెట్‌లో వెయ్యికోట్ల నిధుల కేటాయింపు.(వచ్చే ఏడాది నుంచి)
  3. పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పెంపు.
  4. ఆర్టీసీ అమరుల ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.
  5. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఆర్థికసాయం.
  6. ఉద్యోగుల తల్లిదండ్రులకు ఆసుపత్రి సేవలు, ఉచిత బస్సు పాసులు.
  7. ఉద్యోగుల పిల్లలకు బోధన రుసుముల సౌకర్యం.
  8. పీఎఫ్ బకాయిలు, సీసీఎస్ కు చెల్లించాల్సిన డబ్బుల చెల్లింపు.
  9. తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్.
  10. ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి రూపకల్పన.
  11. ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు.

మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వరాలు..

మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు వేయవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతీ డిపోలో 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చిన్న పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులకు ఖాకీ డ్రెస్ స్థానంలో వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అధికారులూ లాభాల బాట పట్టించండి...

cm kcr review on tsrtc with workers at pragathibhavan
హాజరైన ఆర్టీసీ కార్మికులు

విద్యుత్ ఉద్యోగుల మాదిరిగా ఎక్కువ వేతనాలు, సింగరేణి కార్మికుల వలె ఏటా బోనస్‌లు అందుకునే పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులకు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రూట్లను రీసర్వే చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మంత్రులు, ఎంపీలు మీరు బస్సులో ప్రయాణించండి..

తెరాసకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతి నెలా ఒక రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సీఎం సూచించారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రతీ రెండు నెలలకొకసారి డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించాలన్నారు. రవాణాశాఖ మంత్రి నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

సంతోషం వ్యక్తం చేసిన కార్మిక లోకం...

సంతోషం వ్యక్తం చేస్తున్న కార్మికులు

ముఖ్యమంత్రి తమ కోసం, తమ పిల్లలకోసం, తమ కుటుంబాల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో స్వయంగా మాట్లాడడంతో పాటు కష్టసుఖాలు వివరించడం ఓ మధురానుభూతి అని ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. తాము సంస్థ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తామని కార్మికులు స్పష్టం చేశారు.

sample description
Last Updated : Dec 2, 2019, 7:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.