మనతో పోలీకేంటీ ?
ఇప్పటికే రాజధానులున్న దేశాలకు, రాజధాని లేని రాష్ట్రానికి పోలికేంటని చంద్రబాబు నిలదీశారు. రెండో ప్రపంచయుద్ధం కాలం నాటి రాజధానుల ప్రస్తావన ఇప్పుడెందుకన్నారు. అమరావతి కన్నా గొప్ప ప్రదేశం రాజధానిగా ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.
అనుమానాలు అనవసరం
అమరావతి అభివృద్ధిపై బీసీజీ అనుమానాలు వ్యక్తం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా ప్రకటించగానే ఎన్నో విద్యా సంస్థలు, ఆస్పత్రులు, హోటళ్లు ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారని గుర్తుచేశారు. అవన్నీ మనుగడలోకి వస్తే అమరావతి అభివృద్ధి మరో దశకు వెళ్తుందని వ్యాఖ్యానించారు.
నివేదిక అసత్యమయం
పెరిగే జనాభా అవసరాలకు తగ్గట్లుగా పెద్దపెద్ద నగరాల శివార్లలో అభివృద్ధి చేసిన హబ్‌లు, అర్బన్ టౌన్ షిప్‌లను హరిత నగరాలుగా చూపించి అవన్నీ విఫలమయ్యాయని చెప్పడం బట్టే బీసీజీ నివేదిక చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలమయంగా ఉన్నటువంటి నివేదికకు విలువే లేదన్నారు.
ఇదీ చదవండి : 'ఎవర్ని మోసం చేయడానికి ఈ కమిటీలు'