ETV Bharat / city

ఆర్టీసీ ప్రధానాంశంగా ఎల్లుండి "కేబినెట్" సమావేశం - Telangana Cabinet

ఆర్టీసీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ముహుర్తం కూడా ఖరారైంది. శనివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆర్టీసీ ప్రధానాంశంగా జరగనుంది.

ఆర్టీసీ ప్రధానాంశంగా ఎల్లుండి "కేబినెట్" సమావేశం
author img

By

Published : Oct 31, 2019, 11:25 AM IST

Updated : Oct 31, 2019, 5:13 PM IST

ఆర్టీసీ ప్రధానాంశంగా ఎల్లుండి "కేబినెట్" సమావేశం

ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అవుతోంది. ఆర్టీసీ అంశమే ప్రధాన ఏజెండాగా ఈ సమావేశం జరగనుంది.

ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతులు..!
కార్మికుల సమ్మె కొనసాగుతున్న తరుణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్టీసీలో సగం యాజమాన్య బస్సులు, 30శాతం అద్దె బస్సులు మిగతా 20 శాతం ప్రయివేట్ స్టేజ్ క్యారియర్లు ఉండాలన్నది సర్కార్ ఆలోచన. అందుకు అనుగుణంగా ఇప్పటికే 21శాతం ఉన్న అద్దె బస్సులకు అదనంగా మిగతా 9 శాతం భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక మిగిలింది ప్రయివేటు స్టేజ్ క్యారియర్లకు అనుమతులు ఇవ్వడమే.

4వేల నుంచి 5వేల వరకు...!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం... ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ప్రైవేటు స్టేజ్ క్యారియర్లకు అనుమతులు ఇవ్వొచ్చని సీఎం కేసీఆర్ ఇప్పటికే తెలిపారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు
రంగం సిద్ధమవుతోంది.

నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు రూట్లలో అనుమతుల ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాల్లో ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు హైదరాబాద్​లో మెట్రో రైలుకు సర్వీసుల అనుసంధానం, సెట్విన్ సేవలు వినియోగించుకోవడం లాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటన్నింటిపై శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు పురపాలక ఎన్నికలు సహా ఇతర అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు.

ఇదీ చదవండి:నేడు అన్ని డిపోల్లో సామూహిక దీక్ష

Intro:రంగారెడ్డి జిల్లా : పెద్ద అంబర్ పేట్ బాయ్యవలయ రహదారి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన తూని డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు, భార్య, భర్త మృతి చెందారు. మృతులు అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కోహెడ గ్రామానికి చెందిన దంపతులుగా పోలీసులు గుర్తించారు. కోహెడ గ్రామానికి చెందిన బోక్క రంగారెడ్డి(50),వజ్రమ్మ(45) లు కవాడిపల్లి కి ఓ శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనాన్ని బస్సు వెనుకనుండి డీకోట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుడు హయత్ నగర్ డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నాడు. మృతులకు న్యాయం చేయాలని కోరుతూ స్తానికులు రోడ్డుపై బైఠాయించి అందోళనకు దిగారు.Body:TG_Hyd_10_31_Road Accident_AV_TS10012Conclusion:TG_Hyd_10_31_Road Accident_AV_TS10012
Last Updated : Oct 31, 2019, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.