ETV Bharat / city

భాగ్యనగరంలో సీఏఏను వ్యతిరేకిస్తూ భారీ ప్రదర్శన - Telangana CAA protest latest

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా... వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్ష మందికి పైగా ముస్లిం సోదరులు హైదరాబాద్​ నగరానికి చేరుకున్నారు. సిఏఏ వ్యతిరేకిస్తూ ఇందిరా పార్కు వద్ద భారీ ప్రదర్శన చేపట్టారు. భారీగీ తరలివచ్చిన నిరసనకారులతో ట్యాంక్​బండ్ పరిసరాల్లో రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

CAA opposes huge demonstration
CAA opposes huge demonstration
author img

By

Published : Jan 4, 2020, 7:32 PM IST

Updated : Jan 4, 2020, 7:40 PM IST

భాగ్యనగరంలో సిఏఏ వ్యతిరేకిస్తూ భారీ ప్రదర్శన
హైదరాబాద్​లో ముస్లిం ప్రజలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్ష మందికి పైగా ముస్లిం సోదరులు నగరానికి చేరుకున్నారు. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వ్యతిరేక జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద భారీ ప్రదర్శన చేపట్టారు.

జాతీయ జెండాతో నిరసన..!

పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చిన ముస్లింలు.. ప్రతి ఒక్కరూ జాతీయ జెండా పట్టుకుని పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము భారత్​లోనే పుట్టామని.. చచ్చేవరకు ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. సిఏఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

2 గంటల పాటు నిలిచిన వాహనాలు​
అనంతరం జాతీయగీతం అలపించారు. లక్షలాది మంది తరలిరావడం వల్ల.. ప్రధాన రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్యాంక్‌బండ్‌, తెలుగు తల్లి ప్లైఓవర్, లిబర్టీ, హిమాయత్ నగర్, లోయర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్ ప్రాంతాల్లో రెండు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఇవీ చూడండి: మున్సిపోల్​లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్

Intro:Body:Conclusion:
Last Updated : Jan 4, 2020, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.