ETV Bharat / city

పెళ్లై 48 గంటలే.. అంతలోనే వధువు మృత్యుఒడికి..! - latest news on heart attack deaths in garudakandi

ఆ వధువు కాళ్ల పారాణి ఇంకా ఆరనే లేదు. ఇంట్లో పెళ్లి సందడి తీరనే లేదు. ఇంతలోనే విధి కన్నెర్ర చేసింది. వివాహమైన 48 గంటల్లోనే నవ వధువు గుండెపోటుతో మృతి చెందింది. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తుందనుకున్న సమయంలో మృత్యు ఒడికి చేరడాన్ని జీర్ణించుకోలేని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ హృదయ విదాకర ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గరుడ కండిలో జరిగింది.

srikakulam crime
పెళ్లై 48 గంటలే.. అంతలోనే వధువు మృత్యుఒడికి..!
author img

By

Published : Dec 1, 2019, 2:30 PM IST

పెళ్లై 48 గంటలే.. అంతలోనే వధువు మృత్యుఒడికి..!

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం గరుడ కండిలో పెళ్లింట విషాదం నిండింది. గ్రామానికి చెందిన దమయంతి అనే నవ వధువు శనివారం ఉదయం గుండె పోటుతో మృతి చెందింది. నదిగాం మండలం తురకలకోటకు చెందిన సురేష్​తో నవంబర్ 28న ఆమెకు వివాహం జరిగింది. నవంబర్ 30 తెల్లవారుజామున గుండె పోటుతో ఆమె చనిపోయింది. అప్పటికి ఆమె తన కన్నవారి ఇంట్లో ఉంది. తాళి కట్టిన 48 గంటల్లోనే తన భార్యకు తల కొరివి పెట్టవలిసివచ్చిందని భర్త శోకసంద్రంలో మునిగిపోయాడు. తమ బిడ్డ ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇవీచూడండి: బావిలో పడి యువకుడి ఆత్మహత్య

Intro:AP_SKLM_21_01_Navavaduvu_Mruti_AV_AP10139

నవవధువు గుండె పోటుతో మృతి

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం గరుడ కండి గ్రామానికి చెందిన దమయంతి(30) శనివారం ఉదయం గుండె పోటుతో మృతి చెందిన ఘటన గరుడకండిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నదిగాం మండలం తురకలకోటకు చెందిన సురేష్ తో నవంబర్ 28న దమయంతికి వివాహం జరిగింది. నవంబర్ 30 తెల్లవారుజామున గుండె పోటు రావడంతో మృతి చెందింది. ఈ ఘటన కన్నవారి ఇంటి లో చోటుచేసుకుంది. తాళి కట్టిన 48 గంటలోనే సురేష్ తన భార్యకు తల కొరివి పెట్టె వలిసివచ్చింది.Body:మృతిConclusion:మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.