ETV Bharat / city

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ - క్యాన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

అనంతపురంలో బోన్ కేన్సర్​తో బాధపడుతూ దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న స్వప్నకు... ఆర్థిక సాయం లభించింది. ఈటీవీ భారత్​లో ప్రచురితమైన ''కుంగదీస్తున్నాయి క్యాన్సర్‌ కణాలు... ఆదుకోవాలని ఓ కుటుంబం వేడుకోలు'' కథనానికి సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. స్వప్నకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ
author img

By

Published : Nov 12, 2019, 10:52 PM IST

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

బోన్ కేన్సర్ తో బాధపడుతున్న అనంతపురం జిల్లావాసి స్వప్నకు.. తెదేపా ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అండగా నిలిచారు. ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలు చూసి బాలకృష్ణ స్పందించారు. స్వప్నతో పాటు వారి కుటుంబ సభ్యులను హైదరాబాద్​లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి పిలిపించారు. వారితో 30 నిమిషాలకు పైగా మాట్లాడారు. స్వప్న పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితురాలికి అవసరమైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి, రీసెర్చి ఇన్​స్టిట్యూట్ వైద్యులకు బాలకృష్ణ సూచించారు.

బాలకృష్ణ స్పందనతో స్వప్న ఆనందించింది. తనకు మళ్లీ మామూలుగా బతుకుతానన్న ఆశాభావం వ్యక్తం చేసింది. బాలకృష్ణకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది. స్వప్న చికిత్సకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని ఈ సందర్భంగా బాలకృష్ణ హామీ ఇచ్చారు. బసవతారకం ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామన్నారు. త్వరలోనే స్వప్న పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని, ఉన్నత చదువుల్లో పోటీ పడాలని ఆకాంక్షించారు. స్వప్నతో ఆప్యాయంగా మాట్లాడిన బాలకృష్ణ.. ఆమెకు కొన్ని వస్తువులు అందించారు.

ఇదీ చదవండి

కుంగదీస్తున్నాయి క్యాన్సర్‌ కణాలు... ఆదుకోవాలని ఓ కుటుంబం వేడుకోలు...

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.