సికింద్రాబాద్‌లోని అల్వాల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అల్వాల్‌లోని సువర్ణ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ క్రాంతి స్వరూప్.... అదే అపార్ట్మెంట్లోని జయంత్ అనే బాలుడిపై హత్యాయత్నం చేశాడు. క్రాంతి స్వరూప్ కుమారుడు, జయంత్ ఇద్దరు కలిసి బయట ఆడుకుంటున్న సమయంలో స్వరూప్ రాగానే అతని కొడుకు పైకి వెళ్లగా... జయంత్‌ను క్రాంకి స్వరూప్ చితకబాదాడు... అతని కారుకు అడ్డంగా రావడం వల్ల అతన్ని విచక్షణారహితంగా కొట్టినట్లు జయంత్ తండ్రి తెలిపారు.
అపార్ట్మెంట్లోని సెల్లార్లోకి ఈడ్చుకుంటూ వెళ్లి ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో అక్కడ ఉన్న వాచ్మెన్ చూసి ఆపడం వల్ల అతని ప్రాణాలు దక్కాయని వారు తెలిపారు. గొడవ జరిగిన 8వ తేదీన తాను ఇంట్లో లేనని జయంత్ తండ్రి తెలిపారు. ఆ బాలుడిని క్రాంతి స్వరూప్ కొట్టిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. క్రాంతి స్వరూప్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని జయంత్ తండ్రి వాపోయాడు. నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదుచేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.
ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్‌బండ్ ఎలా చేస్తారు?