ETV Bharat / city

ఆర్టీసీ సమ్మె: 12 నుంచి నిరవధిక నిరాహార దీక్ష - tsrtc strike latest news

హైదరాబాద్​​లోని ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, విపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు సమావేశమయ్యారు. అశ్వత్థామరెడ్డితోపాటు నలుగురు కోకన్వీనర్లతో ఎల్లుండి నుంచి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని తెలిపారు. హక్కులు సాధించేవరకు పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు.

12 నుంచి నిరవధిక నిరాహార దీక్ష
author img

By

Published : Nov 10, 2019, 12:52 PM IST

ఛలో ట్యాంక్​బండ్​ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన కార్మికులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ. ఉపాధ్యాయ సంఘాలకు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 12న ఆయనతో పాటు నలుగురు కోకన్వీనర్లతో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. నిన్న ట్యాంక్​బండ్ వద్ద జరిగిన దమనకాండను ఖండించారు. రేపు అన్ని నియోజక వర్గాల్లో ​ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. కోర్టు సూచనల మేరకు వెంటనే ప్రభుత్వం చర్చలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

12 నుంచి నిరవధిక నిరాహార దీక్ష

హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండానే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం అనడం సమంజసం కాదని అశ్వత్థామరెడ్డి అన్నారు. ట్యాంక్​బండ్​పై నిరసనకు గంట సమయం ఇస్తే ఇంత ఇబ్బంది జరిగేదికాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.