ఏపీ సచివాలయం వైపు వస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. సచివాలయ ప్రాంగణం సమీపానికి చేరుకున్నారు. సచివాలయం వెనుక వైపునుంచి మహిళలు దూసుకొచ్చారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు రావడం వల్ల కొందరు గాయపడ్డారు.
గాయాలతోనే రైతులు, మహిళలు సచివాలయానికి పరుగులు తీశారు. వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పోలీసుల లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి.