రాజ్యాంగం మనకు ఒక గ్రంథమని, కుల మతాలకు అతీతమైందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తామంతా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మ గాంధీ విగ్రహాలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పుష్ఫగుచ్ఛాలతో ఘన నివాళులర్పించారు. శాసనసభ, మండలి తరఫున రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పోచారం తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఎన్నో పథకాలను అమలు చేసుకుంటున్నామని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్