ETV Bharat / city

"బాధతో విలవిలలాడుతున్నా.. కనికరించ లేదు" - SAMATA Today News update

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలంలో జరిగిన సమత హత్యాచారం కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఎల్లాపటారుకు చెందిన ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ  నమోదు చేసిన అభియోగ పత్రంలో 44 మంది సాక్షులను చేర్చారు. హత్యాచారం చేసిన నిందితులు కత్తితో సమతపై కర్కశత్వానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

"బాధతో విలవిలలాడుతున్నా.. కనికరించ లేదు"

author img

By

Published : Dec 15, 2019, 6:22 AM IST

Updated : Dec 15, 2019, 7:40 AM IST

గతనెల 24న కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్యకేసులో పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. A1- షేక్‌బాబు, A2-షాబుద్దీన్, ఏ3-షేక్ ముగ్దుమ్‌లను నిందితులుగా పేర్కొన్నారు.

"బాధతో విలవిలలాడుతున్నా.. కనికరించ లేదు"

నిస్సహాయ స్థితిలో సాయం కోసం చూసింది...
ముగ్గురు నిందితుల్లో చిన్నవాడైన షేక్‌బాబు బాధితురాలిని తొలుత పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అందుకు మిగిలిన ఇద్దరు బాధితురాలి కాళ్లు, చేతులు కదలకుండా పట్టుకొని సహకరించారు. తర్వాత మిగిలిన ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు అత్యాచారం జరిగిన విషయం బయటికి చెబితే క్రిమినల్‌ కేసు అవుతుందని భావించిన నిందితులు సమతను చంపాలని నిర్ణయించుకున్నారు.

కర్కోటకుల రాక్షసతత్వం
"షాబుద్దీన్‌, మక్దూమ్‌ బాధితురాలిని కదలకుండా కాళ్లు,చేతులు పట్టుకోగా షేక్‌బాబు కత్తితో దాడిచేశాడు. బాధతో విలవిలలాడుతున్నా కనికరించని కర్కోటకులు తలపై రాయితో మోదీ అంతమొందించారు"

96 పేజీల నివేదిక - 13 పేజీల ఛార్జిషీట్‌
నిందితుల క్రూరత్వంపై పోలీసులు సాక్ష్యాధారాలతో సహా ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో 96 పేజీల నివేదిక సమర్పించారు. 96 పేజీల నివేదికలో 13 పేజీలు ఛార్జిషీట్‌ కాగా మిగతా పేజీల్లో సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్‌ నివేదికలు, పంచనామాల వివరాలున్నాయి. ఘటనాస్థలం నుంచి సేకరించిన బాధితురాలి చీరపై ఉన్న వీర్యకణాల్ని ధ్రువీకణాలు, నిందితుల రక్తపు నమూనాలతో సరిపోల్చే డీఎన్​ఏ నివేదికల్ని సమర్పించారు.

రేపటి నుంచి విచారణ
సోమవారం నుంచే విచారణ చేపట్టనున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. రోజుకు ఐదుగురు సాక్షులను విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే నిందితుల తరఫున వాదించకూడదని జిల్లా బార్‌ అసోసియేషన్‌ తీర్మానించింది.

ఇవీ చూడండి: ఒడిశాలో మరో 'దిశ'... ఇంటికి సమీపంలోనే!

Intro:Body:Conclusion:
Last Updated : Dec 15, 2019, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.