అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూల పవనాలతో రికార్డు స్థాయిలో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు.. వృద్ధిరేటు తగ్గుతుందన్న మూడీస్ అంచనాల వల్ల నష్టాలతో ముగిశాయి. ఇంధనం, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 71 పాయింట్లు కోల్పోయి 40,939 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 26 పాయింట్ల క్షీణతతో 12,061 వద్ద స్థిరపడింది.
లాభాలు..
ట్రైడెంట్, రిలయన్స్ ఇన్ఫ్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్, గెయిల్, ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
నష్టాలు..
గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఇన్ఫ్రాటెల్, టైటాన్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
రూపాయి క్షీణత
డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 18 పైసలు క్షీణించి రూ. 71.01కి చేరింది. అంతర్జాతీయ విపణిలో బ్యారల్ ముడిచమురు ధర 65.23కు చేరింది.
ఇతర మార్కెట్లు ఇలా
షాంఘై, హాంగ్కాంగ్, సియోల్, టోక్యో, ఐరోపా స్టాక్ మార్కెట్ సూచీలు ఒడుదొడుకుల్లో ముగిశాయి.
ఇదీ చూడండి: 'వృద్ధి రేటును మరోసారి కుదించిన మూడీస్'