అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో గత రెండు రోజుల పాటు పరుగులు పెట్టిన పసిడి, వెండి ధరలు నేడు కాస్త దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం ధర రూ. 74 తగ్గింది. ప్రస్తుత ధర రూ. 38,985కి చేరింది.
" రూపాయి విలువపెరగటం వల్ల దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.74 తగ్గింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 పైసలు పెరిగింది."
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు
బంగారం దారిలోనే వెండి కూడా దిగొచ్చింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.771 తగ్గి.. రూ.45,539 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లలో.. ఔన్సు బంగారం ధర 1,475.40 డాలర్ల వద్ద... వెండి ఔన్సుకు 16.88 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉన్నాయి.
ఇదీ చూడండి: రూ.10వేల లోపు లావాదేవీలకు కొత్త ప్రీపెయిడ్ కార్డు?