దేశంలో నెలకొన్న ఉల్లి కొరత నివారించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విదేశాల నుంచి మరో 12, 660 మెట్రిక్ టన్నుల దిగుమతికి ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ నెల 27న విదేశాల నుంచి వచ్చే ఉల్లి మార్కెట్లోకి చేరనుంది. ఇప్పటికే 30వేల టన్నులను దిగుమతి చేసుకుంది భారత్. వరుసగా రెండోవారంలోనూ ఉల్లిధరలు రూ. 100కు పైగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అదనపు దిగుమతికి మొగ్గుచూపింది సర్కారు.
ఇదీ చూడండి: హైవే పై ఉల్లి- ఎగబడి సంచులు నింపుకున్న జనం