ETV Bharat / business

సిగరెట్​ ఇస్తే ఫుల్​ట్యాంక్​ పెట్రోల్​ ఉచితం! - international news in telugu

సిగరెట్, చాకొలెట్ క్యాండీ ఇస్తే చాలు.. అక్కడ ఫుల్​ ట్యాంక్ పెట్రోల్ కొట్టేస్తారు. ఆ దేశంలో డబ్బుకు లేని విలువ వస్తువులకు ఉండటమే ఇందుకు కారణం. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణంతో కరెన్సీ నోట్లు చెత్తకాగితాలుగా మారిపోయాయి. ఇంతకీ ఆ దేశమేదో తెలుసా..?

Venezuela
author img

By

Published : Oct 22, 2019, 5:23 PM IST

Updated : Oct 22, 2019, 11:13 PM IST

సిగరెట్​ ఇస్తే ఫుల్​ట్యాంక్​ పెట్రోల్​ ఉచితం

అత్యంత చౌకగా పెట్రోల్ లభించే దేశం వెనెజువెలా. చమురుపై ప్రభుత్వం భారీ రాయితీలు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ లాటిన్​ అమెరికా దేశంలో సిగరెట్లు, చాకొలెట్లు ఇచ్చి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే భారీగా పెరిగిన ద్రవ్యోల్బణంతో అక్కడ డబ్బు కన్నా ఈ వస్తువులకే విలువ ఎక్కవ.

పాత కాలం నాటి వస్తుమార్పిడి పద్ధతి ద్వారానే ఇప్పుడు కొనుగోళ్లు చేస్తున్నారు వెనెజువెలా వాసులు. బియ్యం, నూనె.. ఇలా తమ వద్ద ఉన్న ఏదైనా వస్తువును మార్పిడి చేస్తూ అవసరమైనవి పొందుతున్నారు.

"మీరు ఇక్కడ సిగరెట్​ కూడా ఇవ్వవచ్చు. ఇందులో రహస్యమేమీ లేదు. ఎందుకంటే పెట్రోల్​కు విలువ లేదు."

-ఓర్లాండో మోలినా, వాహనదారు

విక్రయదారులు కూడా ఇందుకు అడ్డుచెప్పలేకపోతున్నారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన పరిస్థితుల్లో వారికి ఇంతకుమించిన మార్గం లేదు కూడా.

"చాలా మంది వచ్చి.. పెట్రోల్​కు మా వద్ద డబ్బు లేదంటారు. అదేమీ పెద్ద సమస్య కాదని చెప్పి మేం వారి వద్ద ఉన్న వస్తువును తీసుకుంటాం. వెనెజువెలా మరింత సంక్షోభంలోకి వెళ్లనుంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి చిన్న సహాయాలు ప్రజలకు మేలు చేస్తాయి."

-ఓర్లాండో గోడోయ్, పెట్రోల్ బంక్ ఉద్యోగి

రాజకీయ వివాదం

రాజకీయ, ఆర్థిక సంక్షోభం చమురు దిగ్గజం వెనెజువెలాను కుదిపేస్తోంది. అధ్యక్షుడు నికోలస్​ మదురో, ప్రతిపక్ష పార్టీ నేత జువాన్​ గయిడో మధ్య వివాదం ఈ పరిస్థితులకు దారి తీసింది. 2018 ఎన్నికల్లో మదురో అక్రమంగా పదవిని చేపట్టారని.. గయిడోతో పాటు ఆయనకు మద్దతిస్తున్న అమెరికా సహా 50 దేశాలు ఆరోపిస్తున్నాయి.

చమురు సంస్థకు నష్టాలు

అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే చమురు సంస్థ పీడీవీఎస్​ఏ భారీగా నష్టాల్లో కూరుకుపోయింది. ప్రభుత్వ నిర్వహణ లోపంతో ఉత్పత్తి, అమ్మకం ధరల మధ్య సమతుల్యం తప్పడమే ఇందుకు కారణం. ప్రభుత్వ విధానాలూ ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి.

ద్రవ్యోల్బణం పైపైకి..

2016లో నోట్ల రద్దుతో మొదలైన ఆర్థిక పతనం అక్కడి ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది. 2 లక్షల శాతం పెరిగిన ద్రవ్యోల్బణంతో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. బొలివర్​ విలువ భారీగా తగ్గిన నేపథ్యంలో కరెన్సీ నోట్లు చెత్తకుప్పల్లో దర్శనమిస్తున్నాయి. 50 వేల బొలివర్ల విలువ 2.5 డాలర్లకు సమానంగా ఉంది.

ఇదీ చూడండి: జాతీయ నేతకు చెప్పుల దండ, గాడిదపై ఊరేగింపు!

Rajpura (Punjab), Oct 22 (ANI): Farmers continued to burn stubble in Uksi Jattan village in Rajpura from Punjab. Despite Punjab government's ban, burning of farm residue continued in several areas of Punjab due to lack of alternatives. Over 100 cases of stubble burning have been reported so far. Delhi Chief Minister Arvind Kejriwal has claimed that stubble burning in neighbouring states is one of the main causes of air pollution in the national capital.
Last Updated : Oct 22, 2019, 11:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.