కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు కార్యాచరణను వేగవంతం చేయాలని ప్రపంచ బ్యాంకు పిలుపునిచ్చింది. వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు సొంత నిధులను అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
"ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని అన్ని దేశాలకు మేము పిలుపునిస్తున్నాం. వైరస్ వ్యాప్తిని నియంత్రించి.. భవిష్యత్తులో పెరగకుండా చర్యలు తీసుకోవాలి. వైరస్ ప్రభావిత దేశాలకు మద్దతుగా నిలిచేందుకు నిధులు, సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాన్ని పరిశీలిస్తున్నాం."
- ప్రపంచ బ్యాంకు ప్రకటన
చైనాలో మొదలైన కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 400 మందికి పైగా మరణించారు. సుమారు 20 దేశాల్లో వేలసంఖ్యలో ప్రజలకు ఈ వైరస్ సోకింది.