ETV Bharat / business

రిలయన్స్​ కొత్త ఎండీగా తొలిసారి నాన్​-అంబానీ! - మకేశ్​ అంబానీ తాజా వార్తలు

రిలయన్స్​కు తొలిసారి అంబానీయేతర వ్యక్తి ఎమ్​డీ కానున్నారా? ఔననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. సంస్థ కార్యనిర్వాహక డైరక్టర్, ముకేశ్​ అంబానీ బంధువు నిఖిల్​ మేస్వానీ..., పేరుకు ఎలాంటి ముఖ్య పదవిలో లేకపోయినా ముకేశ్​కు అత్యంత సన్నిహితుడైన మనోజ్​ మోదీలలో ఒకరు కొత్త ఎండీ కానున్నారట.

reliance
రిలయన్స్​ కొత్త ఎండీ
author img

By

Published : Jan 13, 2020, 5:38 PM IST

Updated : Jan 14, 2020, 8:21 AM IST

దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ తమ సంస్థకు కొత్త ఎండీని నియమించే పనిలో ఉన్నారు. సెబీ నూతన నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త ఎండీ కోసం అన్వేషిస్తున్నారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఛైర్మన్‌ బాధ్యతలు వేర్వేరుగా ఉండాలని సెబీ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో అంబానీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సెబీ నూతన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

"కంపెనీలో ఎంతో మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఉండగా.. అందులో అంబానీ ముందు వరుసలో ఉంటారు. అయితే సెబీ నిబంధనల ప్రకారం ఆయన ఎండీగా బాధ్యతలు చేపట్టే అవకాశం లేదు. అలాగే ఎండీగా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి అంబానీ కుటుంబం నుంచి ఉండబోరు"
- విశ్వసనీయ వర్గాల సమాచారం

కనుక రిలయన్స్​ కొత్త ఎండీగా అంబానీయేతర వ్యక్తి ఉండబోతున్నారని తేలింది. సంస్థ కార్యనిర్వాహక డైరక్టర్​ నిఖిల్​ మేస్వానీ, ముకేశ్​ అంబానీకి అత్యంత సన్నిహితుడు మనోజ్​ మోదీ ప్రధానంగా ఎండీ రేసులో ఉన్నారు. మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్లు నిఖిల్​ మేస్వానీ సోదరుడు హితల్​ మేస్వానీ, పీఎమ్​ఎస్​ ప్రసాద్​ కూడా ప్రతిపాదిత జాబితాలో ఉన్నట్లు సమాచారం.

ఎవరీ మేస్వానీ...?

మేస్వానీ సోదరులు 1990వ దశకం నుంచి రిలయన్స్​ బోర్డ్​లో సభ్యులు. వీరు ముకేశ్​ అంబానీకి బంధువులు. వారి తండ్రి రసిక్​లాల్​ మేస్వానీ... రిలయన్స్​ పరిశ్రమల వ్యవస్థాపక డైరక్టర్లలో ఒకరు.

ఎవరీ మోదీ...?

మనోజ్​ మోదీ... రిలయన్స్​ బోర్డులో సభ్యుడు కాదు. సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ స్థానంలో కూడా లేరు. అయినప్పటికీ రిలయన్స్​ సంస్థలో ముఖ్యమైన వ్యక్తి. ముకేశ్​ అంబానీకి అత్యంత సన్నిహితుడు. ఏదైనా ముఖ్యమైన సమావేశాలకు ముకేశ్​ అంబానీ హాజరుకాలేకపోతే.. ఆయన స్థానాన్ని మనోజ్​ మోదీ భర్తీ చేస్తారు.

ఏంటి నిబంధనలు...?

సెబీ నిబంధనల ప్రకారం... లిస్టెడ్​ కంపెనీల్లో ఛైర్మన్​, మేనేజింగ్​ డైరక్టర్​ లేదా సీఈఓ బాధ్యతలు నిర్వర్తించే వాళ్లు వేర్వేరుగా ఉండాలి. ఎండీ పదవి చేపట్టేవారు ఛైర్మన్​ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు అయి ఉండకూడదు. అయితే ఇక్కడ సమీప బంధువులు అంటే ఎవరనేది సెబీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి.

తల్లిదండ్రులు, పినతండ్రి, కుమారులు, కొడుకు వరుస వచ్చే వారు, కూతుళ్లు, కూతురు వరుస వచ్చే వారు, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఇలాంటి వారు ఈ పదవి చేపట్టేందుకు అనర్హులు. అయితే ఇందులో కజిన్​ (తల్లిదండ్రుల తోడబుట్టిన వారి సంతానం) ఒక్కదానికి మినహాయింపు ఉంది.

మేస్వానీ సోదరులు.. ముకేశ్​ అంబానీకి కజిన్స్​. కనుక వీరిద్దరిలో ఎవరైనా ఈ పదవి చేపట్టేందుకు అడ్డులేదు.

ధీరూభాయ్‌ అంబానీ మరణానంతరం ఛైర్మన్‌గా, ఎండీగా ముకేశ్‌ అంబానీ వ్యవహరిస్తున్నారు.

Amaravati (Andhra Pradesh), Jan 13 (ANI): YSR Congress Party leaders and supporters held rally in support of three-capital proposal by State Government. YSRCP supporters held posters favouring decentralisation of power. Several protesters were detained by police. Andhra Pradesh has seen acute unrest in last few days over the three-capital proposal by Jagan Mohan Reddy Government. Opposition TDP is vehemently opposing the proposal.

Last Updated : Jan 14, 2020, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.