దేశీయంగా డిమాండు లేమితో పసిడి ధర నేడు కాస్త తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.196 తగ్గి.. రూ.38,706కి చేరింది.
అంతర్జాతీయ ప్రతికూలతలూ నేటి ధరల క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు.
కిలో వెండి ధర (దిల్లీలో) నేడు ఏకంగా రూ.956 తగ్గి.. రూ.45,498 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,471 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 17.06 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త.. వడ్డీ రేట్ల తగ్గింపు