ఎయిర్ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)ల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మొదలైనప్పటికీ ఊహించని కారణాల వల్ల ఆలస్యమవుతున్నట్లు.. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పెట్టుబడుల విభాగం, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు ఆర్జించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇదీ చూడండి:సుప్రీం కోర్టుకు టాటా సన్స్, సైరస్ మిస్త్రీ వివాదం