ఆటో మొబైల్ దిగ్గజాలైన టయోటా, హోండా... భారీ సంఖ్యలో తమ కార్లను రీకాల్ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు వాటి కార్లలో వేర్వేరు ఎయిర్ బ్యాగ్ సమస్యలను గుర్తించాయి. ఈ నేపథ్యంలో 60 లక్షల యూనిట్ల వరకు రీకాల్ చేయాలని నిర్ణయించాయి.
టయోటా ఎయిర్‌బ్యాగ్ సమస్య..
తమ కార్లలో కొన్ని ప్రమాదానికి గురైనప్పుడు.. ఎయిర్ బ్యాగ్‌లు తెరుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించింది టయోటా. ఆ లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల కార్లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది.
హోండా నుంచి 27 లక్షల కార్లు..
అమెరికా, కెనడాలో హోండా 27 లక్షల కార్లను వెనక్కి రప్పించనున్నట్లు తెలిపింది. టకాట ఎయిర్ బ్యాగ్‌లతో పని చేస్తున్న మోడళ్లను రీకాల్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:అట్లాస్ సైకిల్స్ అధినేత భార్య ఆత్మహత్య