ETV Bharat / business

నేటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్​! - whatsapp can stop working on many devices from today

తమ వినియోగదారులకు షాకిచ్చింది వాట్సాప్​. విండోస్​ ఫోన్లకు 2020 జనవరి 1తో పూర్తిగా సేవలు విరమించుకున్నట్లు స్పష్టం చేసింది. 2020 ఫిబ్రవరి 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ ఫోన్లకు సేవలు నిలిచిపోనున్నట్లు ప్రకటించింది. మరి ఏఏ మోడళ్లకు వాట్సాప్​ సేవలు నిలిచిపోయాయో తెలుసుకోండి.

whatsapp can stop working on many devices from today onwards
నేటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్​!
author img

By

Published : Jan 1, 2020, 6:40 PM IST

Updated : Jan 1, 2020, 6:57 PM IST

ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్లతో ఆకట్టుకునే సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్.. వినియోగదారులకు షాకిచ్చింది. విండోస్​ ఆపరేటింగ్ సిస్టమ్​తో పనిచేసే స్మార్ట్​ఫోన్లలో నేటి నుంచి సేవలు నిలిపి వేసింది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్​తో పని చేసే కొన్ని స్మార్ట్​ఫోన్లకు 2020 ఫిబ్రవరి 1 నుంచి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఏఏ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయో చూద్దాం.

అండ్రాయిడ్​ ఫోన్లు..

వెర్షన్​ 2.3.7 కన్నా తక్కువ ఓఎస్​తో పనిచేస్తున్న అన్ని అండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్​ సేవలు 2020 ఫిబ్రవరి 1 నుంచి ముగియనున్నాయి. ఈ ఓఎస్​​ ఫోన్లు ఉన్న వినియోగదారులు వాట్సాప్​ను ఉపయోగించాలంటే కొత్త మోడళ్లకు అప్​గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.

యాపిల్​ ఫోన్లు..

ఐఓఎస్​ 8, అంతకన్నా తక్కువ ఓఎస్​ వెర్షన్లతో పని చేసే అన్ని యాపిల్​ ఫోన్లలోనూ వాట్సాప్​ సేవలు నిలిచిపోనున్నాయి. 2020 ఫిబ్రవరి 1 నుంచి ఇది వర్తిస్తుంది.

విండోస్​ ఫోన్లు..

విండోస్​ ఫోన్లకు ఈ రోజు నుంచి పూర్తిగా సేవలు ఆగిపోయాయి. ఇకపై విండోస్​ యూజర్లు వాట్సాప్​ వాడాలంటే ఆండ్రాయిడ్​కుగానీ, ఐఓఎస్​కు గానీ మారక తప్పదు.

నిర్ధరించుకోవడం ఎలా..

మీరు పాత ఫోన్లు వాడుతున్నట్లయితే.. సెట్టింగ్స్​లో వాట్సాప్​ ప్రకటించిన వెర్షన్​లలో మీ ఫోన్​ ఉందో లేదో తెలుసుకుంటే సరిపోతుంది. ఒక వేళ మీ ఫోన్​ మోడల్​​ ఆ జాబితాలో ఉంటే మీ వాట్సాప్​ డేటా మొత్తం బ్యాకప్​ చేసుకోవడం మంచిది.

ఆ మోడల్​ ఫోన్లు తక్కువే..

కొన్ని ఫోన్లలో వాట్సాప్​ సేవలు నిలిచిపోనున్నా.. పెద్దగా భయపడాల్సిన పనిలేదన్నది టెక్​ నిపుణుల మాట. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది కనీసం ప్రతి రెండేళ్లకోసారి ఫోన్​ను మారుస్తున్నందున వాటిలో పాత వెర్షన్​ ఓఎస్ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. అండ్రాయిడ్​, ఐఓఎస్​ పాత వెర్షన్​ ఫోన్లు వాడే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని, వారు మాత్రం కొత్త మోడల్​కు అప్​గ్రేడయితే సరిపోతుందని అంటున్నారు. విండోస్​ ఫోన్​ యూజర్లు మాత్రం తప్పని సరిగా అండ్రాయిడ్ గానీ, ఐఓఎస్​కుగానీ మారక తప్పదని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:వరుసగా రెండో నెలలోనూ లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

AP Video Delivery Log - 1200 GMT News
Wednesday, 1 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1120: Hong Kong Protest 3 AP Clients Only 4247055
Big crowd gathers for 1st protest rally of 2020
AP-APTN-1110: Indonesia Flooding AP Clients Only 4247053
4 dead, thousands caught in flooding in Jakarta
AP-APTN-1101: Iraq US Embassy Protest AP Clients Only 4247052
Protests continue in front of the US embassy
AP-APTN-1044: Iraq US Military AP Clients Only 4247050
Video shows US forces arriving at Baghdad embassy
AP-APTN-1032: UK Johnson AP Clients Only 4247049
UK PM hails decade of 'prosperity and opportunity'
AP-APTN-1027: Australia Devastation 3 No access Australia 4247048
Devastation after fire rips Victoria town
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 1, 2020, 6:57 PM IST

For All Latest Updates

TAGGED:

whatsapp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.