ETV Bharat / business

ఈపీఎఫ్ యూనిఫైడ్ పోర్ట‌ల్​తో పొందగలిగే సేవలు ఇవే - ఈపీఎఫ్ యూనిఫైడ్ పోర్ట‌ల్ ద్వారా పొందగలిగే సేవలు

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.... తన ఈపీఎఫ్ యూనిఫైడ్​ పోర్టల్ ద్వారా పలుసేవలు అందిస్తోంది. ఈపీఎఫ్ఓ స‌భ్యులు వారి క్లెయిమ్ స్టేట‌స్‌ను, పాస్‌బుక్ వివ‌రాల‌ను ఆన్‌లైన్​లో త‌నిఖీ చేసుకోవ‌చ్చు. బేసిక్ కేవైసీ వివ‌రాల‌ను ఆన్‌లైన్​లో అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. వీటితో పాటు మరిన్ని వివరాలు తెలుసుకోండి.

various services offered by epf unified portal
ఈపీఎఫ్ యూనిఫైడ్ పోర్ట‌ల్ ద్వారా పొందగలిగే సేవలు
author img

By

Published : Jan 19, 2020, 11:05 AM IST

భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈపీఎఫ్ఓ (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ. ఈపీఎఫ్ఓ అందించే చాలా ప‌థ‌కాలు ఉద్యోగుల‌ను పదవీ విర‌మ‌ణ నిధిని పొదుపు చేసే దిశ‌గా ప్రోత్స‌హిస్తున్నాయి. ఈపీఎఫ్ యూనిఫైడ్ పోర్ట‌ల్.. ఉద్యోగ‌లకు వివిధ అంశాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని అందించ‌డంతో పాటు ఆన్‌లైన్ సేవ‌ల‌ను కూడా అందిస్తుంది. ఈపీఎఫ్ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న ఉద్యోగులకు, ఇది ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ స‌భ్యునిగా మీరు ఇప్ప‌టికే ఈపీఎఫ్‌కు కాంట్రీబ్యూట్ చేస్తుంటే, ఈ వేదిక అందించే ప్ర‌యోజ‌నాల కోసం ముందుగా మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలి. ఖాతాను యాక్టివేట్ చేసుకునేందుకు లేదా పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసుకునేందుకు యూఏఎన్‌(యూనివ‌ర్స‌ల్ ఖాతా నెంబ‌రు)ను అందించాల్సి ఉంటుంది. సంస్థ మీ ప్రావిడెండ్ ఫండ్ కాంట్రీబ్యూష‌న్ల‌ను సుల‌భంగా నిర్వ‌హించేందుకు యూఏఎన్‌ స‌హాయ‌ప‌డుతుంది. ఒక‌సారి యూఏఎన్ నెంబ‌రు యాక్టీవేట్ అయిన అనంత‌రం, ఉద్యోగులు వారి యూఏఎన్ నెంబ‌రు పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఉప‌యోగించి లాగిన్ అయ్యి ఆన్‌లైన్‌లో వివిధ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. పీఎఫ్ పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయడం, లావాదేవీల వివ‌రాలు, ప్ర‌స్తుత ఐడీతో ముందు నెంబ‌ర్ల ఐడీని లింక్‌చేయడం, పీఎఫ్ ఖాతాలో కాంట్రీబ్యూష‌న్ జ‌మ అయిన‌ట్లు ఎస్ఎమ్ఎస్ పొంద‌డం, యూఏఎన్ కార్డు అప్‌డేట్‌, ఉద్యోగం మారిన‌ప్పుడు ఆటో ట్రాన్‌ఫ‌ర్ అభ్య‌ర్ధ‌న‌, కేవైసీ అప్‌డేట్ వంటి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.

ఈపీఎఫ్ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్‌ :

ఇదివరకు రోజుల్లో ఉద్యోగులు పీఎఫ్ డబ్బును బదిలీ చేయడానికి లేదా ఉపసంహరించుకోడానికి, వారు గతంలో పనిచేసిన సంస్థను సందర్శించి, దరఖాస్తు ఫారంలను నింపి, వివిధ డాక్యుమెంట్లతో పాటు దానిని సమర్పించాల్సి వచ్చేది. త‌ర్వాత ‘ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్ క్లెయిమ్ పోర్ట‌ల్ ’ ద్వారా పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లో బ‌దిలీ చేసుకునేవారు. అయితే ప్ర‌స్తుతం యూఏఎన్ ప‌రిచ‌యంతో ఆన్‌లైన్ పీఎఫ్ బ‌దిలీ ‘యూనిఫైడ్ పోర్ట‌ల్​కు మార్చారు. దీనితో పీఎఫ్‌ను ఒక ఖాతా నుంచి మ‌రొక ఖాతాకు ఎలాంటి అవాంత‌రాలు లేకుండా సుల‌భంగా బ‌దిలీ చేసుకోవ‌చ్చు.

ఈ-సేవ‌ :

ఈ పోర్ట‌ల్​లో ఉద్యోగులంద‌రికీ ఈ-సేవ అందిస్తారు. ఇందులో మీరు యూఏఎన్ కార్డు డౌన్​లోడ్‌, కేవైసీ స‌మాచారం అప్‌డేట్‌, యూఏఎన్ నెంబ‌రుతో అనుసంధానించిన పాస్‌బుక్ పొంద‌డంతో పాటు మ‌రిన్ని సౌక‌ర్యాల‌ను పొంద‌వ‌చ్చు. యూఏఎన్ నెంబ‌రు ద్వారా ఈ-సేవ కోసం న‌మోదు చేసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా :

కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో పీఎఫ్ మొత్తాన్ని పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఆధార్‌తో అనుసంధాన‌మైన యూఏఎన్ నెంబ‌రు స‌హాయంతో ఆన్‌లైన్ పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ఇన్‌-ఆప‌రేటీవ్‌ అకౌంట్స్ :

ఇన్‌-ఆప‌రేటీవ్ ఖాతాల ఆన్‌లైన్‌ స‌హాయ‌కేంద్రం(హెల్ప్ డ‌స్క్‌) ద్వారా లావాదేవీలు నిలిచిపోయిన పాత‌ పీఎఫ్ ఖాతాల‌ను సుల‌భంగా గుర్తించి ఆ ఖాతాలో ఉన్న నిధుల‌ను ప్ర‌స్తుత ఖాతాలోకి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఇందుకుగాను మీరు ముందుగా ప‌నిచేసిన ఉద్యోగానికి సంబంధించిన కొన్ని వివ‌రాల‌ను అందించాలి. అయితే పెట్టుబ‌డిదారుడు 20 సంవ‌త్స‌రాల త‌రువాత చేసే క్లెయిమ్‌ల‌కు, ఫార‌మ్ హెచ్‌ను ఇవ్వ‌కుండానే పీఎఫ్ మొత్తాన్ని ఉప‌సంహ‌రించుకోవచ్చు. ఇందులో మొద‌టి 15 సంవ‌త్స‌రాల పెట్టుబ‌డిపై మాత్ర‌మే వ‌డ్డీ వ‌స్తుంది. మిగిలిన 5 సంవ‌త్స‌రాల‌కు వ‌డ్డీ చెల్లించ‌రు.

క్లెయిమ్‌లు, ఎస్ఎమ్ఎస్‌, పాస్‌బుక్‌ :

ఈపీఎఫ్ఓ స‌భ్యులు వారీ క్లెయిమ్ స్టేట‌స్‌ను, పాస్‌బుక్ వివ‌రాల‌ను ఆన్‌లైన్లో త‌నిఖీ చేసుకోవ‌చ్చు. బేసిక్ కేవైసీ వివ‌రాల‌ను ఆన్‌లైన్లో అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. చివ‌రి కాంట్రీబ్యూష‌న్ వివ‌రాలు, కేవైసీ స్టేట‌స్‌, ప్ర‌స్తుత పీఎఫ్ బ్యాలెన్స్‌, ఎస్ఎమ్ఎస్‌ను పంపించ‌డం ద్వారా తెలుసుకోవ‌చ్చు. లేదా 011-22901406 మిస్‌డ్ కాల్ ఇచ్చి, ఎస్ఎమ్ఎస్ ద్వారా స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చు.

ఇదీ చూడండి: వీసా లేకున్నా ఈ దేశాలకు భారతీయులు వెళ్లొచ్చు!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.