టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఎట్టకేలకు టీవీ వీక్షకులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంది. గత ఏడాది నుంచి అమలు అవుతున్న బ్రాడ్ కాస్ట్ నిబంధనలను సవరించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం బోకే, నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు(ఎన్‌సీఎఫ్) తగ్గించింది.
తగ్గనున్న బిల్లులు
సవరించిన నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు చెల్లిస్తున్న రూ.150 ఎన్‌సీఎఫ్ ఛార్జీ ఇక నుంచి రూ.130 కానుంది. ఈ మొత్తంతో వినియోగదారుడు ఉచితంగా చూసే వీలున్న 100 ఛానెల్స్‌ను 200కు పెంచింది. అలాగే మల్టీ టీవీ ఛానెల్స్ వీక్షించే వినియోగదారులకు సైతం ఛానెల్స్ రేటు తగ్గించింది.
మార్చి నుంచి అమల్లోకి..
ఈ సవరించిన కొత్త నిబంధనలను 2020 జనవరి 15 లోగా ప్రసారకర్తలు , 2020 జనవరి 30 లోగా డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు తెలియజేయాలని స్పష్టం చేసింది ట్రాయ్. కొత్త మార్పులు 2020 మార్చి 1 నాటికి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
ఇదీ చూడండి: నేటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!