ఆదాయపు పన్ను శాఖ 2020 సంవత్సరానికి గానూ కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసింది. పన్ను సంబంధిత అన్ని ముఖ్యమైన గడువు తేదీల జాబితాను ఇందులో పొందుపరిచింది. పన్ను చెల్లింపుదారులు వారి ఆదాయపు పన్ను రిటర్నులను సులభంగా ఫైల్ చేయడంలో సహాయపడేందుకు 'ఫైల్ ఇట్ యువర్‌సెల్ఫ్' పేరుతో క్యాలెండర్‌ను రూపొందించింది. ఈ ఈ-క్యాలెండర్ ఐటీఆర్ రిటర్నులు ఎప్పుడు ఫైల్ చేయ్యాలో గైడ్ చేస్తుంది. ఈ విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ, పన్ను చెల్లింపుదారులకు తెలియజేస్తుంది.
2020కి గాను ఐటీ విభాగం ప్రకటించిన ముఖ్య తేదీలు:
జనవరి 15 | జనవరి నెల క్యాలెండర్ 2019 డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసికానికి టీసీఎస్, టీడీఎస్ డిపాజిట్ల గడువు తేదీలను గుర్తు చేస్తుంది. |
జనవరి 30, 31 | జనవరి నెల క్యాలెండర్ డిసెంబరు31, 2019తో ముగిసిన త్రైమాసికానికి టీసీఎస్, టీడీఎస్ డిపాజిట్ల గడువు తేదీలను గుర్తు చేస్తుంది. |
ఫిబ్రవరి 15 | 2019 డిసెంబర్ 31తో ముగిసే త్రైమాసికానికి టీడీఎస్ సర్టిఫికేట్ మంజూరు. |
మార్చి 15 | 2020-21 సంవత్సరానికి నాల్గవ, ఆఖరి వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు చివరి తేది. |
మార్చి 31 | 2019-20 సంవత్సరానికి ఆలస్యంగా లేదా సవరించిన ఆదాయపుపన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేది. |
మే 15 | ఆర్థిక సంవత్సరం 2019-20, 4వ త్రైమాసికం, టీసీఎస్ స్టేట్‌మెంట్ సమర్పించేందుకు చివరి తేది. |
జూన్ 15 | అసెస్మెంటు సంవత్సరం 2021-22 మొదటి వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు చివరి తేది. |
జులై 31 | వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసేందుకు చివరి తేది. |
సెప్టెంబర్ 15 | రెండవ వాయిదా అడ్వాన్స్ టాక్స్ చెల్లించేందుకు చివరి రిమైండర్ సెప్టెంబరు 15. |
సెప్టెంబర్ 30 | కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు, ఆడిట్ చేయవలసిన ఖాతాదారులందరికీ ఐటిఆర్ దాఖలు చేసేందుకు చివరి తేది. |
డిసెంబర్ 15 | అసెస్మెంట్ సంవత్సరం 2020-21 కోసం మూడవ విడత ముందస్తు పన్ను చెల్లించడానికి చివరి తేది. |
క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి: ఆదాయపు పన్ను శాఖ 2020 క్యాలెండర్
ఇదీ చూడండి: శాంసంగ్ నుంచి ప్రీమియం ఫీచర్లతో రెండు బడ్జెట్ ఫోన్లు