దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ మినహా బ్యాంకింగ్, ఇన్ఫ్రా, వాహన, లోహ, ఇంధన రంగాలు సూచీలను పరుగులు పెట్టిస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (సెన్సెక్స్) 471 పాయింట్లు వృద్ధి చెంది 41వేల 288 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (నిఫ్టీ) 139 పాయింట్లు లాభపడి 12 వేల 165కు చేరుకుంది.
యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడిచేసిన తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతికి ముందడుగు వేశారు. ఉగ్రసంస్థ 'ఇస్లామిక్ స్టేట్'పై ఇరాన్ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ట్రంప్ ప్రకటనతో మదుపరుల సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
లాభనష్టాల్లో
ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు భారతీ ఇన్ఫ్రాటెల్, ఐఓసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, బీపీసీఎల్ రాణిస్తున్నాయి.
టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
అంతర్జాతీయ సానుకూల పవనాలతో ఆసియా మార్కెట్లు... జపాన్, కోస్పీ, హాంకాంగ్, చైనా మార్కెట్లు లాభాల్లో సాగుతున్నాయి. వాల్ స్ట్రీట్ కూడా బుధవారం లాభాలతో ముగిసింది.
రూపాయి విలువ
రూపాయి విలువ 22 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.71.47గా ఉంది.
ముడిచమురు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.69 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 65.89 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: ప్రజలకు మంచి చేసే అంకురాలకు పెట్టుబడులు