శాంసంగ్ ఇండియా గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.38,999గా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.40,999గా నిర్ణయించింది.
ఫీచర్స్
- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
- సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
- 128 జీబీ అంతర్గత మెమోరీ(1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు)
- 6.7 అంగుళాల ఇన్ఫినిటీ-ఓ-డిస్ప్లే
- ఎక్సినోస్ 9810 ప్రాసెసర్ చిప్సెట్
- వెనుకవైపు మూడు కెమెరాలు(12ఎంపీ, 12ఎంపీ, 12ఎంపీ)
- 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన ఎస్ పెన్ ద్వారా ఫొటోలు, వీడియోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చని శాంసంగ్ తెలిపింది. ఎయిర్ కమాండ్ ఫీచర్ ద్వారా ఒక్క క్లిక్‌తో ఫొటోలు తీసుకోవచ్చు.
ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల నుంచి 'గెలాక్సీ నోట్ 10 లైట్' ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 3 నుంచి అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లతో పాటు శాంసంగ్.కామ్ వెబ్సైట్లో స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
ఇదీ చదవండి: ఆస్పత్రి బిల్లుకూ ఇక ఈఎంఐ- అపోలో నుంచి కొత్త కార్డు