రియల్మీ 5 సిరీస్‌లోని మరో సరికొత్త ఫోన్ రియల్మీ 5ఐ నేడు భారత్ మార్కెట్లో విడుదల కానుంది. చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్మీ 2020లో భారత్‌లో విడుదల చేస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే.
జనవరి 6న వియత్నాంలో రియల్మీ 5ఐ లాంఛ్ అయింది. అంతకు ముందే రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ శేఠ్ తన ట్విట్టర్ ఖాతాలో రియల్మీ 5ఐ టీజర్‌ను ఉంచారు. జనవరి 9న ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రియల్మీ తన అధికారిక వెబ్సైట్లో రియల్ 5ఐ కోసం ప్రత్యేకంగా ఓ ల్యాండింగ్ పేజీని కూడా ఏర్పాటుచేసింది.
రియల్మీ 5ఐ ఫీచర్లు
- 6.5 అంగుళాల హెచ్డీ+(720X1600 పిక్సెల్) ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే
- వాటర్ డ్రాప్ నాచ్ లేదా మినీ డ్రాప్ నాచ్
- స్నాప్‌డ్రాగన్ 665 చిప్సెట్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 4జీబీ+64జీబీ స్టోరేజి
రియల్మీ యూఐ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. అది అందుబాటులోకి వచ్చేంత వరకు రియల్మీ 5ఐ ఆండ్రాయిడ్ 9 ఆధారంగా పనిచేసే కలర్ ఓఎస్ 6.2తో నడుస్తుంది. ఎంట్రీ లెవల్ వినియోగదారులకు ఇది బాగా అక్కరకు వస్తుంది.
కెమెరా
రియల్మీ టీజర్ ప్రకారం, క్వాడ్ కెమెరా సెటప్ ఉండొచ్చు. అయితే అధికారికంగా నిర్ధరణ కాలేదు. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్ సెన్సార్, మాక్రో కెమెరా ఉండొచ్చు.
రెడ్మీ 8కి పోటీగా..
రియల్మీ 5ఐని రెడ్మీ 8కి పోటీగా తీసుకొస్తున్నట్లు భావించవచ్చు. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.7,999 నుంచి రూ.8,999 మధ్య ఉండొచ్చు.
ఇదీ చూడండి: ట్రంప్ శాంతి ప్రకటనతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు