రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. నెమ్మదించిన వృద్ధికి ఊతమిచ్చేలా రెపో రేటును 5.15శాతం వద్దే కొనసాగించాలని ఆరుగురు సభ్యుల కమిటీ తీర్మానించింది.
"వడ్డీ రేట్లు మరింత తగ్గించేందుకు వీలు ఉందని ద్రవ్యపరపతి కమిటీ గుర్తించింది. అయితే వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఈ సమయంలో కొంత విరామం తీసుకోవడమే సముచితమని భావించింది."
-ఆర్బీఐ ప్రకటన
వృద్ధి రేటు అంచనాపై...
2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు 5 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.
2019-20 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో చిల్లర ధరల ద్రవ్యోల్బణం 5.1 - 4.7 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో 4- 3.8 శాతం ఉంటుందని అంచనా వేసింది.
ఫిబ్రవరి-అక్టోబర్ మధ్య ఆర్బీఐ రెపోరేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
ఇదీ చూడండి: ట్రంప్ కుమారుడు, భార్య ఎంట్రీతో 'అభిశంసన'లో కొత్త ట్విస్ట్