సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్గా తిరిగి నియమించాలని 'కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ కోర్టు' ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రతన్ టాటా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పు.. కేసు రికార్డులకు విరుద్ధంగా ఉందని రతన్ పేర్కొన్నారు.
మిస్త్రీ వర్సెస్ టాటా
టాటా సన్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సైరస్ మిస్త్రీని పునర్నియమించాలని ఎన్సీఎల్ఏటీ 2019 డిసెంబర్ 18న తీర్పునిచ్చింది. మిస్త్రీ నియామకం నాలుగు వారాల తర్వాత అమల్లోకి వస్తుందని.. ఈ లోపు టాటా సన్స్ అప్పీలుకు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అప్లిలేట్ ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది టాటా సన్స్.
ఆర్ఓసీ విజ్ఞప్తిపై ఉత్తర్వులు రిజర్వ్
సైరస్ మిస్త్రీ కేసు తీర్పులో మార్పులు చేయాలని రిజస్ట్రీ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వులో ఉంచింది ఎన్సీఎల్ఏటీ. ఈనెల 6న తీర్పు ఉండవచ్చనే సంకేతాలిచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూనే రతన్ టాటా తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చూడండి: ట్రంప్ దెబ్బకు నింగికెగసిన పసిడి ధరలు