ETV Bharat / business

ఇకపై ఫోన్​ పే నుంచీ 'ఏటీఎం' సేవలు

ఫోన్​ పే తన వినియోగదారుల కోసం మరో అదిరిపోయే ఫీచర్​ను తీసుకొచ్చింది. నగదు ఉపసంహరణకు ‘ఫోన్‌పే ఏటీఎంను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా దీనిని దిల్లీలో ప్రారభించింది. దీని ద్వారా రూ.1000 వరకు నగదు ఉపసంహరించుకోవచ్చని స్పష్టం చేసింది.

PhonePe ATM Feature Launched in delhi
ఫోన్‌పే ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ సేవలు
author img

By

Published : Jan 23, 2020, 9:19 PM IST

Updated : Feb 18, 2020, 4:10 AM IST

ఆన్‌లైన్‌ లావాదేవీల సంస్థ ‘ఫోన్‌పే’ తన వినియోగదారులకు మరో మంచి సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాలో డబ్బున్నా... నగదు అవసరమైనప్పుడు దగ్గర్లో ఏటీఎం లేకపోతే ఇబ్బందులు పడుతుంటాం. ఇక ఇలాంటి ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం దక్కనుంది.

ఫోన్​పే ఏటీఎం

ఇప్పటి వరకూ చెల్లింపుల సదుపాయం మాత్రమే కల్పించిన ఫోన్​పే... నగదు ఉపసంహరణకు ‘ఫోన్‌పే ఏటీఎంను ప్రవేశపెట్టింది. ఫోన్‌పే వినియోగదారులు ఫోన్​పే యాప్‌ సదుపాయం ఉన్న దుకాణాదారుల వద్ద దీని ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఒక వినియోగదారుడు కేవలం రూ.1000 మాత్రమే పొందే అవకాశం ఉంది. యాప్‌ ఓపెన్‌ చేసి స్టోర్స్‌లోకి వెళ్లి ఫోన్‌పే ఏటీఎం మీద క్లిక్‌ చేస్తే మన దగ్గరలో ఫోన్‌పే సదుపాయం గల దుకాణాలు కనిపిస్తాయి.

ప్రయోగాత్మకంగా

అయితే, దీన్ని ప్రయోగాత్మకంగా దిల్లీలో గురువారం అందుబాటులోకీ తీసుకొచ్చారు. ఈ సదుపాయం ద్వారా మన బ్యాంకు ఖాతాలోని దుకాణదారుడి దగ్గరకు వెళ్లి అతని వద్ద మనం నగదు తీసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని సంస్థ ప్రకటించింది. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు నగదు లావాదేవీల్లో ఇబ్బందులను తొలగించేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకీ తీసుకొచ్చామని సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: 'పాక్​ ప్రధాని'​ వార్తలు చూడట్లేదట.. ఎందుకు?

Last Updated : Feb 18, 2020, 4:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.