అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావం భారత్‌పైనా పడింది. మంగళవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు, డీజిల్ ధర 12 పైసలు చొప్పున పెరిగాయి.
ప్రధాన నగరాల్లో..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ ప్రకారం... లీటర్ పెట్రోల్ ధర దిల్లీలో రూ.75.74, కోల్‌కత్తాలో రూ.78.33, ముంబయిలో రూ.81.33, చెన్నైలో రూ.78.69గా ఉంది. లీటర్ డీజిల్ ధర... దిల్లీలో రూ.68.79, ముంబయిలో రూ.72.14, కలకత్తాలో రూ.71.15, చెన్నైలో రూ.72.69గా ఉంది.
భగభగలు
2020 సంవత్సరం మొదటి ఏడు రోజుల్లోనే పెట్రోల్ ధర 60 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరగడం గమనార్హం.
గల్ఫ్ ఉద్రిక్తతలే కారణం
ఇరాన్ కమాండర్ సులేమానిని అమెరికా భద్రతాదళాలు హతమార్చిన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
ఇదీ చూడండి: కేంద్రానికి చుక్కెదురు.. 'ఆర్‌కామ్'కు రూ.104 కోట్లు రీఫండ్!