బిహార్ రాజధాని పట్నాలో ఉల్లిని కొనేందుకు సామాన్యులు ఎగబడ్డారు. పెరిగిన ధరల దృష్ట్యా.. బిహార్ ప్రభుత్వం తక‌్కువ ధరకు ఉల్లి అమ్మకాలు చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఉదయాన్నే విక్రయ కేంద్రాలు, వాహనాల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు.
రూ.35కే కిలో..
దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర 90 నుంచి 100 రూపాయల వరకూ పలుకుతోంది. ఈ క్రమంలో రాయితీపై కిలో రూ. 35 చొప్పున విక్రయిస్తోంది బిహార్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సంస్థ. ఈ సమాచారం తెలుసుకున్న వినియోగదారులు ఉల్లిపాయలను కొనేందుకు ఎగబడ్డారు. ఉల్లిని అధికంగా పండించే మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉల్లిధరలు పెరిగాయి.
ఇదీ చూడిండి: ట్రక్కులో 40 టన్నుల ఉల్లి.. మార్గ మధ్యలోనే మాయం!