పెట్రోల్ బంకుల కారణంగా పర్యావరణం ప్రభావితమవుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్ సూచనలకు అనుగుణంగా నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాలలు, ఆస్పత్రులు, నివాస ప్రాంతాలకు కనీసం 50 మీటర్ల దూరంలో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని చమురు సంస్థలను ఆదేశించింది. వేపర్ రికవరీ సిస్టెమ్(వీఆర్ఎస్)ను ప్రతి బంకులో ఏర్పాటు చేయాలని తెలిపింది.
నూతన నిబంధనల్లో కొన్ని...
- పాఠశాలలు, ఆస్పత్రులు, నివాస ప్రాంతాలకు 50 మీటర్ల లోపు పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయకూడదు.
- ఒకవేళ 50 మీటర్ల దూరంలో ఉన్నట్లైతే పీఈఎస్ఓ నిబంధనల ప్రకారం మెరుగైన భద్రతా పరమైన చర్యలను కచ్చితంగా పాటించాలి.
- నూతనంగా ఏర్పాటు చేసే బంకుల్లో వేపర్ రికవరీ సిస్టమ్ (వీఆర్ఎస్ )ను ఏర్పాటు చేయాలి.
- వీఆర్ఎస్ ఏర్పాటులో విఫలమైతే కాలుష్య నియంత్రణ మండలి విధించిన పరిహరం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నూతన నిబంధనలను ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సభ్యులు, నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ), ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టీఈఆర్ఐ), పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులతో కూడిన నిపుణులు సంయుక్తంగా రూపొందించారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్'పై చైనా కుయుక్తులు- వ్యతిరేకిస్తామన్న ఫ్రాన్స్