బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్‌షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం లభించింది. తద్వారా ఈ పురస్కారాన్ని అందుకున్న నాలుగో భారత వ్యక్తిగా నిలిచారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జి, మదర్‌థెరిసాలు గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వాణిజ్య, విద్యాపరమైన సంబంధాల బలోపేతంలో కృషి చేసినందుకు గాను మజుందార్ షాకు ఈ పురస్కారం లభించింది. భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ హరిందర్ సింధు ఈ పురస్కారాన్ని కిరణ్ మజుందార్ షాకు అందజేసినట్లు బయోకాన్ సంస్థ ప్రకటించింది.
ఇదీ చూడండి: మీ క్రెడిట్ స్కోర్ తగ్గిందా? అయితే ఇలా చేయండి..!