ETV Bharat / business

వ్యాపార మాయాజాలంలో పడ్డారో.. మీ జేబు గుల్లే! - డెకాయ్ ఎఫెక్ట్​తో మీ జోబుకి చిల్లే

హాయ్​ పండగ సీజన్​ వచ్చేస్తోంది. షాపింగ్ టైమ్ ఆసన్నమవుతోంది. ఆన్​లైన్, ఆఫ్​లైన్ విక్రేతలు అందిరిపోయే ఆఫర్లతో మిమ్మల్ని ఊరించడానికి తయారవుతున్నారు. అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఊరికే ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తే వాళ్లకు గిట్టుబాటు అవుతుందా? కానేకాదు. అందుకే వారు మీపై 'డెకాయ్​' ప్రయోగిస్తారు. లెక్కలేనన్ని ఆప్షన్స్ మీ ముందు ఉంచి..మీ జేబుకు చిల్లు పెడతారు. ​ ఇంతకీ 'డెకాయ్​' అంటే ఏమిటో అనుకుంటున్నారా? మీరే చూడండి.

the decoy effect
డెకాయ్​ ఎఫెక్ట్​
author img

By

Published : Jan 3, 2020, 6:01 AM IST

హాయ్​ మీరు షాపింగ్​ ఎక్కువగా చేస్తుంటారా? ఆఫర్లలో వచ్చే ఐటెమ్స్​ను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారా? సరసమైన ధరకే కోరుకున్నవి దక్కించుకున్నామని సంతోషపడుతున్నారా ? అయితే మీరు 'డెకాయ్​ ఎఫెక్ట్​'కు బలైనట్లే.

డెకాయ్​ ఎఫెక్ట్​

డెకాయ్​ ఎఫెక్ట్ అంటే ఆశపెట్టి మోసం చేయడం. ఇదో మార్కెటింగ్ ట్రిక్. అంటే వ్యాపారి లేదా వ్యాపార సంస్థ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఆఫర్ల 'వల'లో పడేస్తున్నారన్నమాట.

డెకాయ్​ ఎఫెక్ట్​ వినియోగదారులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేలా చేస్తుంది. లేదా మీకు అంతగా అవసరం లేని వస్తువులను మీరు కొనుగోలు చేసేలా చేస్తుంది. ఫలితంగా మీ జేబులకు చిల్లుపడుతుంది.

ఉదాహరణ I:

మీరు దిల్లీ నుంచి విశాఖపట్నం రావాలి అనుకుందాం. విమానం టికెట్​ ధరలు ఇలా ఉన్నాయి.

1. మధ్యలో మరో నగరంలో 60 నిమిషాల పాటు ఆగే విమానం 'ఏ' టికెట్​ ధర రూ.5000/-

2. మధ్యలో మరో నగరంలో 150 నిమిషాల పాటు ఆగే విమానం బి టికెట్ ధర రూ.4000/-

3 మధ్యలో మరో నగరంలో 60 నిమిషాల పాటు ఆగే విమానం 'సీ' టికెట్ ధర రూ.5,500/-

ఈ ఉదాహరణని నిపుణులు అధ్యయం చేయగా.. ఎక్కువ మంది విమానం 'ఏ'ను ఎంచుకున్నారు. ఎందుకంటే, అది 'సీ' కన్నా తక్కువకు వస్తోంది. అయితే ఇక్కడ ఎక్కువ మంది ఎంచుకున్న 'ఏ' టికెట్​ ధర విమానం 'బీ' కన్నా ఖరీదైనది.

ఉదాహరణ II:

1. మధ్యలో 60 నిమిషాలు ఆగే విమానం 'ఏ' టికెట్ ధర రూ.5000/-

2. మధ్యలో 150 నిమిషాలు ఆగే విమానం 'బీ' టికెట్​ ధర రూ.4,000/-

3. మధ్యలో 180 నిమిషాలు ఆగే విమానం 'సీ' టికెట్​ ధర రూ.4,000/-

ఈ సందర్భంలో ఎక్కువ మంది విమానం 'బీ'ని ఎంచుకున్నారు.

ట్రిక్కు తెలుసుకున్నారా?

ఉదాహరణ - I, ఉదాహరణ - IIలను పోల్చి చూస్తే 'బీ' విమానం టికెట్​ ధర, 'వేచి ఉండే సమయం'లో ఎలాంటి తేడా లేదు. కానీ ఉదాహరణ -Iలో ఎక్కువ మంది 'బీ'ని ఎంచుకోలేదు. ఉదాహరణ-IIలో మాత్రం అందరూ 'బీ' విమానంవైపే మొగ్గుచూపారు. దీనికి ప్రధాన కారణం విమానం 'సీ'.

విమానం 'సీ' ధర, 'వేచి ఉండే సమయం'లో ఉన్న తేడాలు... మొదటిసారి వద్దనుకున్న (బీ విమానం టికెట్​) ఎంపికనే.. రెండోసారి ప్రజలు ఏరికోరి ఎంచుకునేలా ప్రభావితం చేశాయి. అంటే ఎంపిక చేసుకునే ఛాయిస్ మనకు ఇస్తున్నట్లు భ్రమింపజేసి... మన జేబుల్ని ఖాళీ చేయిస్తారు. దీనినే డెకాయ్ ఎఫెక్ట్ అంటారు.

ప్రభావం అపారం..

ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్కులు వినియోగదారుల నిర్ణయాన్ని 40 శాతం మేర మార్చేస్తాయని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ డెకాయ్​ ఎఫెక్ట్​.. ఉద్యోగ నియామకాలు, వైద్య, రాజకీయ రంగాల్లోనూ ప్రభావం చూపిస్తున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు.

మరో ఉదాహరణ

ఒక అధ్యయనం ప్రకారం... ఒక ప్రముఖ మ్యాగజైన్​ డిజిటల్​ సబ్​స్క్రిప్షన్​ రూ.60, ప్రింట్ సబ్​స్క్రిప్షన్ రూ.120, మూడో ఆప్షన్​గా 120 రూపాయలకే డిజిటల్​+ప్రింట్​ సబ్​స్క్రిప్షన్స్​​ ఉంచారు. ఇంకేముంది ఎక్కువ మంది మూడో ఆప్షన్​ను ఎంచుకున్నారు. ఇక్కడ పాఠకులను ప్రలోభపెట్టింది (డెకాయ్) ప్రింట్​ మాత్రమే.

అక్కడ ఆటలు సాగవ్​..

డెకాయ్ ప్రభావం వజ్రాల లాంటి ఖరీదైన వస్తువుల విషయంలో పనిచేయకపోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే అందరూ అంత సులువుగా ప్రలోభాలకు లోనుకారు. కనుక డెకాయ్ ప్రభావం అందరి మీదా ఒకేలా పనిచేయదు.

'ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టెస్టోస్టీరాన్​ అధికంగా ఉన్నవారు దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితంగా వాళ్లు సులువుగా డెకాయ్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది' అని అధ్యయనాలు చెబుతున్నాయి.

వైద్య, రాజకీయ రంగాల్లో, ఉద్యోగ నియామకాల్లోనూ డెకాయ్ ఎఫెక్ట్​ ప్రభావం కనపడుతోందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఆఫర్లు, ఆప్షన్స్​ మీ ముందు ఉన్నప్పుడు.. లాజికల్​గా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవడం మంచింది.

ఇదీ చూడండి: రాబోయే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గిస్తారా?

New Delhi, Jan 02(ANI): Farhan Akhtar took to instagram and shared his first look from the upcoming sports-drama 'Toofan' and announced the release date. Film narrates the story of a boxer which is produced by Ritesh Sidhwani, Farhan Akhtar and Rakeysh Mehra
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.