వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా రెండో నెలలోనూ లక్ష కోట్ల రూపాయలు దాటాయి. 2018 డిసెంబర్లో రూ.97,276 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు.... 2019 డిసెంబర్ నాటికి రూ.1.03 కోట్లకు పెరిగాయి. 2019 నవంబర్లోనూ జీఎస్టీ రూ.1,03,492 కోట్లు వసూలైంది.
స్లాబుల వాటా
- 2019 డిసెంబర్లో మొత్తం వసూళ్లు: రూ.1,03,184 కోట్లు
- కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ): రూ.19,962 కోట్లు
- రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ): రూ.26,792 కోట్లు
- ఐజీఎస్టీ రూ.48,099 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.21,295 కోట్లతో కలిపి)
- సెస్ రూ.8,331 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.847 కోట్లతో కలిపి).
16 శాతం వృద్ధి
2018 డిసెంబర్‌తో పోలిస్తే... దేశీయ లావాదేవీలపై వసూలైన జీఎస్టీ 2019 డిసెంబర్‌కు 16 శాతం పెరిగింది.
ఇదీ చూడండి: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు