ETV Bharat / business

2019-20లో భారత వృద్ధిరేటు 5 శాతమే! - Growth in India is projected to decelerate to five per cent in 2019-2020: World Bank

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధిరేటు 5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది ప్రపంచ బ్యాంకు. అయితే 2020-21లో మాత్రం దేశ వృద్ధిరేటు 5.8 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. పెట్టుబడి, వాణిజ్య రంగాలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో 2020లో ప్రపంచ వృద్ధిరేటు 2.5 శాతం వరకు పెరుగుతుందని వెల్లడించింది.

Growth in India is projected to 'decelerate' to five per cent in 2019-2020: World Bank
2019-20లో భారత వృద్ధిరేటు 5 శాతమే!
author img

By

Published : Jan 9, 2020, 10:50 AM IST

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 5 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కానీ 2020-21 నాటికి ఈ వృద్ధి రేటు కొంత అభివృద్ధి చెంది.. 5.8 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

"భారత్​లో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రుణ బలహీనత కొనసాగుతుంది. మార్చి 31తో ముగిసే 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 5 శాతానికి తగ్గుతుంది. అయితే తరువాతి ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధిరేటు 5.8 శాతానికి చేరుకునే అవకాశం ఉంది."- ప్రపంచ బ్యాంకు

బ్యాంకింగేతర సంస్థలలో రుణాల మంజూరు కోసం ఉన్న కఠినతర నిబంధనలు, వినియోగంలో తగ్గుదలకు తోడు ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలు కూడా దేశ వృద్ధిరేటుపై ప్రభావం చూపుతున్నాయని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

ప్రపంచ వృద్ధిరేటు..

పెట్టుబడి, వాణిజ్య రంగాలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో 2020లో ప్రపంచ వృద్ధిరేటు 2.5 శాతం వరకు పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

ఇదీ చూడండి: రెడ్​మీ 8కి పోటీగా రియల్​మీ 5ఐ- నేడే లాంఛ్​

ZCZC
PRI ESPL NAT NRG
.SHIMLA DES54
HP-FIRST VOTER
India's first voter Shyam Saran Negi taken ill
          Shimla, Jan 8 (PTI) India's first voter Shyam Saran Negi is not keeping well. He is being treated at his home in Kalpa of Himachal Pradesh's Kinnaur district.
          Negi (103) was the first person in the independent India to cast his vote in an election due to which he was made the brand ambassador of the 2019 parliamentary polls.
          Himachal Pradesh Health and Family Welfare Minister Vipin Singh Parmar has directed Kinnaur Chief Medical Officer (CMO) to provide medical treatment to Negi at his residence.
          A team from the Health Department had visited him and provided medical treatment.
          Parmar also prayed for his speedy recovery. PTI DJI
RDK
RDK
01082104
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.