ఇరాన్ అత్యున్నత సైనికాధికారి లక్ష్యంగా అమెరికా దాడులు, రూపాయి విలువ పతనంతో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.752 పెరిగి రూ.40,652కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.960 పెరిగి రూ.48,870కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్
అంతర్జాతీయ విపణిలోనూ బంగారం, వెండి ధరలు బాగా పెరిగిపోయాయి. ఔన్స్ బంగారం ధర 1,547 డాలర్లకు చేరుకోగా, ఔన్స్ వెండి ధర 18.20 డాలర్లకు పెరిగిపోయింది.
ట్రంప్ దెబ్బతో..
"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ అత్యున్నత సైన్యాధికారిపై వైమానిక దాడులు చేసి హతమార్చారు. మరోవైపు రూపాయి విలువ 24 పైసలు పతనమై, డాలరుకు రూ.71.62కు పడిపోయింది. ఈ నేపథ్యంలో నష్టభయంలేని బంగారంపై పెట్టుబడిదారులు దృష్టి కేంద్రీకరించారు. ఫలితంగానే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి."- వకిల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్
ఇదీ చూడండి: 'అమెరికా దాడి'పై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయంటే..?