భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, కేంద్రీయ బ్యాంకులు స్థిరంగా కొనుగోళ్లు చేస్తుండటం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీన పడటం వంటి కారణాల వల్ల ఈ ఏడాది ముగిసేలోపు, ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో మేలిమి (999 స్వచ్ఛత) బంగారం 10 గ్రాములు రూ.42,000కు చేరే అవకాశం ఉందని కామ్‌ట్రెండ్జ్ రీసెర్చ్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అంచనా వేశారు.
అప్పటికీ అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం 1650 డాలర్లకు చేరొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం కామెక్స్‌లో ఔన్సు బంగారం 1506 డాలర్లు ఉండగా, ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,302గా ఉంది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం 1460-1530 డాలర్ల మధ్య ఉండొచ్చని, అంటే దేశీయంగా రూ.36,800-39,400 మధ్య ఎంసీఎక్స్‌లో కదలాడొచ్చని కోటక్ సెక్యూరిటీస్ కమొడిటీస్ అధిపతి రవీంద్ర రావు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో పసిడిపై పెట్టుబడులు పెరిగాయని వెల్లడించారు.
ఇదీ చూడండి : 5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్ ఫోన్!