ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నేడు పుంజుకుంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.143 పెరిగింది. ప్రస్తుత ధర రూ.38,695కు చేరింది.
డాలర్‌తో పోలిస్తే.. రూపాయి విలువ తగ్గటం, అంతర్జాతీయ సానుకూలతలు పుత్తడి ధర పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు.
బంగారంతో పాటే వెడి ధర పెరిగింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.108 వృద్ధిచెంది.. రూ.45,345కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. ఔన్సు బంగారం ధర 1,458 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 16.92 డాలర్ల వద్ద ఉంది.